Skip to main content

Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

ఈ ప్ర‌జా ఐఏఎస్ ఆఫీస‌ర్ కేర‌ళ‌లో ఒక సంచ‌ల‌నం. విన్నూత ఆలోచ‌న విధానాల‌తో వివిధ సేవ‌కార్య‌క్ర‌మాల్లో ముంద‌డుగులో ఉంటాడు.
Krishna Teja, IAS
మైలవరపు కృష్ణ తేజ, ఐఏఎస్ ఆఫీస‌ర్

ఏ జిల్లాలో ప‌నిచేసిన ఆ జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో చిర‌స్థాయిగా ఉండేలా ప‌నిచేయ‌డం ఈయ‌న నైజం. విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో ఈయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఆశ్చ‌ర్యం కల్గించేలా ఉంటాయ్‌. ఈయ‌నే మ‌న‌ తెలుగు తేజం..యువ ఐఏఎస్ ఆఫీస‌ర్ మైలవరపు కృష్ణ తేజ. ప్ర‌స్తుతం ఈయ‌న‌ కేర‌ళ టూరిజం డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌తో  ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌(education.sakshi.com)తో ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ

కేర‌ళ కేడ‌ర్‌లో జాయిన్ అయిన వెంట‌నే మీరు ఉన్న ఏరియాలో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చాయి..దీనిని మీరు ఎలా ఎదుర్కొన్నారు ?

Kerala Floods


కేర‌ళ కేడ‌ర్‌లో జాయినైన వెంట‌నే వ‌చ్చిన అతి పెద్ద‌ విప‌త్తు భారీ వ‌ర‌ద‌లు. ఆ సమ‌యంలో నేను వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు నేను కూడా దాదాపు మునిగే ప‌రిస్థితిలో ఉండి... అక్క‌డి ప్ర‌జ‌ల‌ స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాను. 48 గంట‌ల్లో దాదాపు 2 ల‌క్ష‌ల‌ మందికి పైగా ప్ర‌జ‌ల‌ను, వేల‌ల్లో ముగ‌జీవాల‌ను కాపాడాము. ఇదంతా ఒక పక్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాము. ఎవ‌రికి ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా చేశాము. ఇలా ఇంత మంది ప్ర‌జ‌ల‌ను కాపాడినందుకు నాకు చాలా సంతోషం అన్పించింది. అలాగే UNICEF వాళ్లు కూడా ప్ర‌త్యేకంగా వ‌చ్చి అభినందించారు . అలాగే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు పంపించిన ఒక్క మెడిసిన్ కూడా వాడ‌కుండా అవి అన్ని వాళ్ల‌కే తిరిగి పంపేశాము. ఎందుకంటే మేము ముందుగానే ప్ర‌జ‌ల ఆరోగ్య విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల వాళ్ల అవ‌స‌రం మాకు రాలేదు. మా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చూసి WHO ఆశ్చ‌ర్య‌పోయింది. అలాగే 700 పైగా ఉన్న‌ పున‌రావ‌స కేంద్ర‌ల్లో ఉన్న వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో కూడా స‌క్సెస్ అయ్యాము.

ప్రకృతి వైపరీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు...
ప్రకృతి వైపరీత్యాలు సంభ‌వించిన స‌మ‌యంలో ముఖ్యంగా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడటమే ధ్యేయంగా ముందుకు వెళ్తాము. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రాణ ఆస్తి నష్టం జ‌ర‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్న‌స్తాం.

మొద‌ట మీరు కేర‌ళ ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేకం అయ్యారు?

Krishna Teja, IAS


నేను కేర‌ళ కేడ‌ర్‌కు 6వ ఆప్ష‌న్‌గా పెట్టుకున్నాను. కేర‌ళ కేడ‌ర్‌లో జాయిన్ అయినందుకు మా నాన్న చాలా సంతోషించారు. నా ఫ‌స్ట్ పోస్టింగ్ గురువాయుర్‌. నేను కేరళ ప్ర‌జ‌ల గురించి...సంస్కృతి గురించి తెలుసుకోవ‌డానికి 6 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఇక్క‌డ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ కూడా చాలా బాగుటుంది. నాక‌న్నా బాగా డెవ‌ల‌ప్ అయిన, తెలివిగ‌ల ప్ర‌జ‌ల వ‌ద్ద‌  ప‌ని చేస్తున్నాను అనిపించింది. కొద్ది రోజుల త‌ర్వాత మ‌ళ‌యాళం భాష కూడా నేర్చుకున్నాను. వాళ్లతో మాట్ట‌డంతో నాకు ఈజీగా మ‌ళ‌యాళం భాష వ‌చ్చింది.

Krishna Teja, IAS: ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యాడు... ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలిచాడు

ఒక ఐఏఎస్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణం ఏమిటి ?
ఏదైన ఒక ప‌ని మొద‌లు పెట్టితే... చాలా ఓపిగ్గా... నేర్పుతో ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే అది నిలబడుతుంది. నాకు ఈ గుణం ఒక ఏడాది పాటు ఎగ్జామ్ రాయ‌డం వ‌ల్ల వ‌చ్చింది.

మీ ల‌క్ష్యం ఏమిటి ..?

IamforalleppeyHelpIAS HelpHouseStudentsIAS Officer Helping


ఫేస్‌బుక్ ను ఉప‌యోగించుకుని rehabilitation campaign నిర్వ‌హిస్తున్నా. ఫేస్‌బుక్‌లో "I Am For Alleppey" అనే పేజీని క్రియోట్ చేశాము. దీని ద్వారా వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాను. అలాగే విద్యార్థుల హాజ‌రుశాతం పెంచేందుకు వివిధ వినూత్న ప‌ద్ద‌తుల ద్వారా హాజ‌రుశాతం పెంచాము. విక‌లాంగులు, ముస‌లివారి కోసం వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేశాను. మ‌హిళ‌ల‌కు కావాల్సిన ఇంటిస‌రుకులు మొద‌లైన వాటిని ఇచ్చాము. అలాగే పచ్చదనం కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నాము. ఇంటి నిర్మాణాలు, మత్స్యకారులకు ప్ర‌త్యేక కిట్ ఇచ్చాము. ఇలా I Am For Alleppey అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఇంత పెద్ద ఎత్తున campaign నిర్వ‌హించాము. ఈ ఫేస్‌బుక్ పేజీ ఒక హిస్ట‌రీ క్రియేట్ చేసింది.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

D.Roopa, IPS: ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఐపీఎస్‌..ఎక్క‌డైన స‌రే త‌గ్గ‌దేలే..

Published date : 05 Jan 2022 06:07PM

Photo Stories