IAS Rukmani Riar Real Story : అప్పుడు చదువులో ఫెయిల్... కానీ ఇప్పుడు అందరికి షాక్.. ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారిలా.. కానీ..
ఎంత అవమానం...?
6వ క్లాసులో ఫెయిల్ అయింది. వీరి కుటుంబంలో తల తీసేసినట్టయింది. వీరు అసలే బాగా చదువుకున్న ఫ్యామిలీ. అలాంటి కుటుంబంలో పుట్టి.. ఇలా ఫెయిల్ అవ్వడం ఏంటి..? పైగా తండ్రి న్యాయవాది. ఎంత అవమానం..?
వీళ్ల కుటుంబం చాలా భయపడ్డారు.
ఒక్కగానొక్క కూతురు చదువు ఇలా అయిపోయిందేంటని వాళ్లెక్కడ ఇదైపొతారో అని బిక్కచచ్చింది. కానీ నాన్న ఏమీ అనలేదు. పైగా ధైర్యం కూడదీశారు. ఆరో తరగతిలో ఫెయిలైతే ఏంటి తల్లీ.. నువ్వు ఐఏఎస్ అవుతావు అన్నారు. ఆ ధైర్యంతోనే గువ్వపిల్ల రివ్వున ఎగిరింది ఆకాశంలోకి. ఆమె రెక్క ముందు గొప్ప ఆకాశః కూడా చిన్నబోయింది. చీకటి ఎంత సేపు వుంటుంది..? సముద్రం ఎంత పెద్దదైనా కావొచ్చుగాక.. అందులో ఈత కొడుతున్న చేపపిల్ల ముందు అదొక పిల్ల కాలువ. ఓ సినీ కవి చెప్పినట్టు.. చీకటి ఎంత సేపు వుంటుంది. ఉషోదయాన్ని ఎవడాపుతాడు? నీరసిస్తే లాభం లేదు. పట్టుదల అంకితభావం ఉంటే అంతకంటే పెద్ద సైన్యం ఇంకేముంటుంది. జయం దానంతట అదే నిశ్చయమవుతుంది. రుక్మిణి రియార్ విషయంలో అదే జరిగింది.
తన కూతురిని ఏమీ అనకుండా..
ఆరో తరగతిలో ఫెయిల్ అయింది ఇలా అయితే నిన్ను హాస్టల్లో పడేస్తా! అప్పుడు గానీ తిక్క కుదరదు! సాధారణంగా పేరెంట్స్ పిల్లలతో అనే మాటలివి. హాస్టల్ అంటే అదేదో శిక్షకు పర్యాయపదం అయిపోయింది. రుక్మిణి కథ కూడా సేమ్. ఏదో నరకంలో పడ్డ ఫీలింగ్. విపరీతమైన మానసిక ఒత్తిడి. చదవలేక పోయింది. ఫలితంగా ఆరో తరగతిలో ఫెయిల్ అయింది. చాలా భయపడింది. అమ్మానాన్న ఏమంటారో అని! పైగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చుట్టాలు బందువుల దగ్గర ఎంత నామూషీ! రుక్మిణి తండ్రి సమాజం గురించి తెలిసిన మనిషి. అందుకే కూతురిని ఏమీ అనలేదు. పైగా పిల్లలు ఇష్టపడి చదవాలే గానీ కష్టపడుతూ చదవకూడదనేది అతని పాలసీ. ఫెయిల్ అన్నమాట డిక్షనరీలోనే ఉండొద్దని చండీఘర్ హోషియార్‌పూర్ .
రుక్మిణి పుట్టింది పెరిగింది అంతా అక్కడే. తండ్రి బల్జీందర్ సింగ్. పెద్ద లాండ్ లార్డ్స్. న్యాయవాది కూడా. అమ్మ గృహిణి. అలా ఆరో క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ..రుక్మిణి పడి లేచిన కెరటమయింది.
కాలేజీ టాపర్.. కానీ
ఇంకోసారి ఫెయిల్ అన్నమాట డిక్షనరీలోనే ఉండొద్దని డిసైడయింది. తానేంటో నిరూపించాలనుకుంది. గమ్యాన్ని ముద్దాడేదాకా విశ్రమించేది లేదని ఉడుంపట్టు పట్టింది. అలా ఓటమి అనే పదమే రాకుండా చూసుకుంది. ఏడు నుంచి మాస్టర్ డిగ్రీ వరకు క్లాస్ టాపర్.. కాలేజీ టాపర్. యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్టు. గురునానక్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ (హానర్) చదివింది. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేసింది.
ఇవే సివిల్స్ వైపు రాణించాయ్.. తొలి ప్రయత్నంలోనే..
హార్డ్ వర్క్.. , డెడికేషన్ ఆమెను యూపీఎస్సీ సివిల్ సర్వీసుల వైపు తీసుకెళ్లాయి. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ మెయిన్ సబ్జెక్ట్స్. సింగిల్ అటెంప్ట్‌లోనే... అంతే ఐఏఎస్ నేనే తేలిపోవాలనుకుంది. రోజుకు పది గంటల పాటు ప్రిపరేషన్. అనుకున్నట్టే సివిల్స్ అంతు చూసింది. 2011లో సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఫలితాలొచ్చాయి. రుక్మిణి టాప్ సెకండ్ ర్యాంకర్. తండ్రి ఆనందానికి హద్దుల్లేవు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ రెండో ర్యాంక్ సివిల్స్ పరీక్షలో దేశంలోనే రెండో ర్యాంకును సాధించి రుక్మిణి రియార్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు .
నా సలహా ఒక్కటే..
టీచర్లు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతటి ఘనతను సాధించానని ఆమె గర్వంగా ప్రకటించుకున్నారు. నిజాయితీ, అంకిత భావంతో పేదలకు సేవ చేయాలన్న ఆకాంక్షతోనే సివిల్స్ పరీక్ష రాశానని రుక్మిణి చెప్పుకొచ్చారు. కొంతమంది అవినీతి పరులు దేశానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నట్టు రుక్మిణి పోయెట్రీ కూడా రాస్తుంది.
మహిళలు ఇంటా బయటా ఎదుర్కొనే వివక్ష మీద కొన్ని రైటప్స్ ఉన్నాయి. గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో మీద కూడా సమాజంలో చైతన్యం తీసుకురావాలనేద తన లక్ష్యం. యువతకు రుక్మిణి ఇచ్చే సందేశం ఒక్కటే.. హార్డ్ వర్క్ చేయండి అనుకున్నది సాధించండి. విజయానికి అదొక్కటే దారి. ఓపిక ఇంపార్టెంట్. సహనమే సక్సెస్ కు బాటలు పరుస్తుంది. ఈమె సక్సెస్ జర్నీ నేటి యువతకు ఎంతో ఆదర్శవంతమైనది.
Tags
- రుక్మిణీ రియర్
- Rukmani Riar IAS Success Story In Telugu
- Rukmani Riar IAS Success Story
- Rukmani Riar IAS Success Story in Telugu
- Rukmani Riar IAS Real Life Story in Telugu
- rukmani riar ias biography
- rukmani riar ias batch
- rukmani riar ias upsc rank
- rukmani riar ias upsc civils success story
- UPSC Topper Rukmani Riar Background
- UPSC Topper Rukmani Riar IAS Background
- UPSC Topper Rukmani Riar IAS Background in Telugu
- IAS Topper Rukmani Riar
- Rukmani Riar IAS Real Life Story
- ias success story in telugu
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- civils success stories
- Ias Officer Success Story
- upsc ranker success story in telugu
- real life upsc ranker success story in telugu
- IAS Rukmani Riar Real Life Motivational Story
- IAS Rukmani Riar Real Life Motivational Story in telugu
- telugu IAS Rukmani Riar Real Life Motivational Story in telugu
- Success Stroy