DSC Ranker Inspirational Success Story : టీ అమ్మూతూ..రూ.5 భోజనం తింటూ.. ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించానిలా.. కానీ..
వీరు తాత్కాలిక ఆనందానికి దూరంగా ఉంటూ.., కష్టపడి చదివితే వచ్చే ఫలితం శాశ్వత ఆనందం ఇస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో ఏ పేదింటి బిడ్డ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ మీకోసం...
కేవలం ఆరంటే ఆర్నెల్లలోనే..
ఈ యువకుడు తల్లిదండ్రులతో కలిసి టీ విక్రయించేవాడు. ఒకవైపు టీ అమ్మూతూ.. మరోవైపు..రోజూ 14 గంటల పాటు చదివాడు. తనకంటే ఓ లక్ష్యం నిర్దేశించుకున్నాడు. కేవలం ఆరంటే ఆర్నెల్లలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఈ యువకుడు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావనే నిరుత్సాహంతో ఉన్న యువతకు ఆదర్శంగా నిలిచాడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఉడాన్ శివమహేశ్.
కుటుంబ నేపథ్యం :
శివమహేశ్ తల్లిదండ్రులు ఉడాన్ సుశీల – లక్ష్మణ్. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు. ఇందులో శివమహేశ్ రెండో కుమారుడు. ధర్మారంలో కుటుంబపోషణ కష్టంగా మారడంతో సమీపంలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి వలస వెళ్లారు సుశీల– లక్ష్మణ్. అక్కడే ఓ హోటల్ ప్రారంభించారు. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ దంపతులు.
ఎడ్యుకేషన్ :
శివమహేశ్ చదువులో చురుకుగా ఉండంతో... ధర్మారంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివించారు. ఇక్కడి సాధన జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన శివమహేశ్.. కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ, ఆ తర్వాత అంబేడ్కర్ యూనివర్శిటీలో ఎంపీ(హిందీ) సబ్జెక్టులో పీజీ పూర్తిచేశాడు.
వివాహం చేసుకోవడంతో.. కుటుంబ పోషణ భారమై..
ఇదే సమయంలో వివాహం చేసుకున్న శివమహేశ్‌కు కుటుంబపోషణ భారమైంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తూనే.. టీస్టాల్ నిర్వహించాడు. ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోటీ పరీక్షలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి.
ప్రతీరోజు రూ.5కే భోజనం తింటూ..
అయితే.., అతడి శ్రేయోభిలాషుల సహకారంతో నెలరోజుల పాటు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఆ తర్వాత మూడు నెలలు కరీంనగర్‌లోని జిల్లా గ్రంథాలయం కేంద్రంగా ప్రిపేరయ్యాడు. ప్రతీరోజు రూ.5కే భోజనం తింటూ రోజూ దాదాపు 12–14 గంటల పాటు చదువుకున్నాడు.
జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి..
ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయ ఫలితాల్లో టీజీటీ, పీజీటీలో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించాడు. ఆ తర్వాత టీఎస్పీ పీఎస్సీ జేఎల్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, జేఎల్ (హిందీ)లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. ప్రసుత్తం నిర్మల్ జిల్లా మామిడి గురుకులం విద్యాలయంలో జేఎల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ప్రకటించిన డీఎస్సీ(స్కూల్ అసిస్టెంట్)లో ఉద్యోగం సాధించారు. పెద్దపల్లి జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి కొలువు కొట్టేశాడు. ఇలా వరుసగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శివమహేశ్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. లక్ష్యం సాధించాలనే.. బలమైన పట్టుదల, కసి ఉంటే.. సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు.. శివమహేశ్. ఈతని సక్సెస్ జర్నీ నేటి యువతికు ఎంతో స్ఫూర్తినిస్తుంది.
Tags
- Succcess story
- Tea vendor from Peddapalli gets five government jobs
- Tea vendor from Peddapalli gets five government jobs Success Story
- Udan Shiva Mahesh
- Udan Shiva Mahesh DSC Success Story in Telugu
- Udan Shiva Mahesh JL Success Story
- Udan Shiva Mahesh JL Success Story in Telugu
- Udan Shiva Mahesh got five government jobs within 6 months
- Shiva Mahesh DSC Ranker success Story
- Shiva Mahesh DSC Ranker success Story in Telugu
- Telugu News Shiva Mahesh DSC Ranker success Story in Telugu
- Gurukulam JL Ranker Success story
- Shiva Mahesh JL Ranker Success Story
- DSC and JL Ranker Shiva Mahesh Success story in telugu
- sakshieducation success stories