Skip to main content

Young Women Success Story : స‌క్సెస్ కొట్టాలంటే...వ‌య‌సుతో సంబంధం లేదు... నేను ఈ ఏజ్‎లోనే...

Young women pilot success and inspiring story

అనుకున్నది సాధించాలంటే ఒక‌టి ల‌క్ష్యంపై ప‌ట్టుతో ఉండాలి. మ‌రొక‌టి, ఎంత క‌ష్ట‌మైనా నిలబ‌డి ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించాలి. అది 30 అయినా, లేదా 18 అయినా, క‌ల‌ను సాకారం చేసుకుంటే పొందే ఆనందం ఎప్పుడైనా ఒక్క‌టే. 18 ఏళ్ల‌కే ఒక యువ‌తి త‌న చిన్న‌ప్ప‌టి క‌ల‌ను ప్ర‌తీ మెట్టును విజ‌య‌వంతంగా ఎక్కి సాకారం చేసుకుంది.

Young Man Success Story : రెండేళ్లు గ్రంథాల‌యంలోనే.. ఐదు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. ఇదే నా స‌క్సెస్ స్టోరీ!

కర్ణాటకలోని విజ‌య‌పుర‌కు చెందిన అమీన్ హుల్లూర్ ఒక ఇంటీరియర్ డిజైనర్, తల్లి టీచ‌ర్‌.. వారి కుమార్తె స‌మైరా హుల్లూర్. ఈ యువ‌తి త‌న ప్రైమ‌రీ, సెకెండ‌రీ ఎడ్యుకేష‌న్‌ను త‌న న‌గ‌రంలోనే పూర్తి చేసుకుంది. త‌న‌కి చిన్నత‌నం నుంచే పైలెట్ అవ్వాల‌నే ఆశ ఉండేది. ఇందుకు త‌న త‌ల్లిదండ్రుల నుంచి కూడా త‌న‌కు స‌హ‌కారం అందింది. అయితే, త‌న పీయూసీ (ఇంట‌ర్మీడియ‌ట్‌)ను పూర్తి చేసుకున్న స‌మైరా వెంట‌నే ఢిల్లీకి వెళ్లింది.

Telangana Student : ఏపీ కోర్టులో తెలంగాణ బిడ్డ‌... స‌క్సెస్ స్టోరీ ఇదే..

అక్క‌డ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌ను విజ‌యవంతంగా పూర్తి చేసుకుంది. అన్నింటిలోనూ పాసైంది. ఇక్క‌డ ఇవ్వాల్సిన ప‌రీక్ష‌ల అనంత‌రం మహారాష్ట్ర‌లోని బ‌ర‌మ‌తికి వెళ్ళి అక్క‌డ ఉన్న కార్వర్ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది.

Success

వ‌యోప‌రిమితి కార‌ణంగా..

డీజీసీఏ నిర్వ‌హించిన ఐదు ప‌రీక్ష‌ల్లో నాలుగు ప‌రీక్ష‌ల‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాని, వ‌య‌సు త‌క్కువ ఉన్న కార‌ణంగా ఒక ప‌రీక్ష‌ను ఇవ్వ‌లేక‌పోయింది. ఈ స‌మయాన్ని వినియోగించుకొని, కార్వ‌ర్ ఏవియేష‌న్ అకాడ‌మీలో ట్రైనింగ్ తీసుకుంది. స‌రైన స‌మ‌యం రాగానే మిగిలిన ప‌రీక్ష‌ను కూడా రాసి మొత్తం ఐదు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి చివ‌రిగా న్యూ ఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీ (వీవైఏఏ)లో పూర్తి ట్రైనింగ్ తీసుకుంది స‌మైరా.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

200 గంట‌ల అనుభవం..

స‌మైరా త‌న ప్ర‌తీ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేసుకుని, చివరిగా ప్రాక్టిల‌క్ టెస్ట్ కోసం పైలెట్ స్థానంలో కూర్చుని విమాన ప్ర‌యాణంలో కూడా నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ల్లో గెలుపునే ద‌క్కించుకుంది. ఇలా, త‌న ప్ర‌యాణంలో పూర్తిగా 200 గంట‌ల అనుభ‌వాన్ని సాధించుకుంది.

తండ్రి మాట‌లు..

స‌మైరాకు చిన్నత‌నం నుంచే పైలెట్ కావాల‌నేది ఆశయంగా పెట్టుకుంది. ఇది తెలుసుకున్న మేము కూడా చాలా ఆనందించి త‌న‌కు స‌పోర్ట్‌గా నిలిచాం. త‌న‌కు తొలి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌తీ ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకొని ప్ర‌తీ మెట్టు ఎక్కుతున్న‌ప్పుడు చాలా ఆనందం ఉండేది. హెలికాప్టర్‌లో రైడ్ చేయడం వల్ల ఆమె ఆకాశంలో త‌న‌ కెరీర్‌ను త‌యారుచేసుకునేందుకు నిర్ణయించుకునేలా చేసిందని ఆమె తండ్రి అమీన్ హుల్లూర్ గుర్తు చేసుకున్నారు.

Constable Success Story : మా ఊరి నుంచి ఫ‌స్ట్‌ పోలీస్‌ అయ్యింది నేనే.. కానీ..!

మేము టిక్కెట్లు కొని పైలట్ పక్కన కూర్చున్న‌ప్పుడు సమైరా పైలట్‌తో జ‌రిపిన సంభాష‌ణ‌, త‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం వీటితోపాటు ఆ పైలెట్ ఎంతో ఓర్పుతో త‌న‌కు ఇస్తున్న స‌మాధానాల‌కు స‌మైరా అక్క‌డే త‌న ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకుంది. త‌న‌కు ట్రైనింగ్ అనంత‌రం, 18 ఏళ్ల‌కే లైసెన్స్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

స‌మైరాకు ఇత‌నే స్పూర్తి..

Success

చిన్న‌త‌నంలోనే నాకు పైలెట్ అవ్వాల‌నే ల‌క్ష్యం ఏర్ప‌డింది. అందుకు సంబంధించిన ప్ర‌తీ ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధం అయ్య‌ను. ఇందుకు నాకు నా త‌ల్లిదండ్ర‌లు కూడా స‌హ‌క‌రించారు. ప్ర‌తీ నిమిషం న‌న్ను ప్రోత్సాహిస్తూనే వ‌చ్చారు. వారి అనుభ‌వంతో నాలో ఎక్కువ స్పూర్తి నింపారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

నాకు ఇలా విమానం న‌డిపేందుకు పైలెట్‌గా ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర్చుకొని ముందుకు సాగేందుకు 25 ఏళ్ల‌కే పైలెట్‌గా లైసెన్స్‌ను సాధించిన కెప్టెన్ తపేశ్ కుమార్ నాకు స్పూర్తి అని చెప్పుకొచ్చింది స‌మైరా. రాష్ట్రంలోనే అతి పిన్న వ‌య‌సులో పైలెట్‌గా లైసెన్స్ పొందిన యువ‌తిగా నిలిచాన‌ని త‌న సంతోషాన్ని వ్యక్తం చేశారు స‌మైరా. ఈ విజ‌యానికి త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారం, ప్రోత్స‌హం కూడా తోడైయ్యాయ‌ని, వారికి కూడా ఎంతో ఆనందంగా ఉందని తెల‌పారు.

ఇత‌ర బాలిక‌ల‌కు ఆమె స్పూర్తి..

ఇప్పుడు ఆమె రాష్ట్రంలోనే వెనుకబడిన అనేక ఇతర బాలికలకు, యువ‌తీ యువ‌కుల‌కు ప్రేరణగా ఉంది. ఇక్కడ బాలికల విద్యా స్థాయిలు రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్నాయి" అని కర్ణాటకలోని అక్క మహాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, జర్నలిజం విభాగం అధిపతి ఓంకార్ కకడే తెలిపారు.

Published date : 05 Dec 2024 03:14PM

Photo Stories