Skip to main content

IPS Success Story : ఈ కార‌ణంతోనే రూ.30 లక్షల జీతం జాబ్‌కు రాజీనామా చేసి.. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానిలా.. కానీ..!

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ లాంటి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించ‌డం ఒక ఎత్తు అయితే... ఉద్యోగంలో చేరి స‌వాళ్ల‌ను ఎదుర్కొవ‌డం మ‌రో ఎత్తు. అది ఐపీఎస్ ఆఫీస‌ర్ లాంటి ఉద్యోగం అయితే నిత్యం ఎదో ఒక స‌మ‌స్య‌తో కూడి ఉంటుంది.
ips officer Krishnan kumar bishnoi success story

కానీ ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఎలాంటి భ‌యం లేకుండా.. నేరస్తుల పాలిటి సింహ స్వప్నంలా మారాడు. ఇత‌నే.. కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఐపీఎస్‌. ఈ నేప‌థ్యంలో...కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఐపీఎస్ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబం- చ‌దువు :

krishan bishnoi ips success story in telugu

కృష్ణ కుమార్ బిష్ణోయ్.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామ నివాసి. తన ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడైన కృష్ణ తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే అభ్యసించారు. ఇతర పిల్లల్లాగే అతను కూడా కాలినడకన పాఠశాలకు వెళ్లేవారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివి జిల్లాకే టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత సికార్‌లోని ఓ పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకుని 10వ పరీక్షలో ఫస్ట్‌ డివిజన్‌తో ఉత్తీర్ణత సాధించారు. 

జోధ్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదివి.. డిగ్రీ చదవడం కోసం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇంతలో విదేశాల్లో చదవాలనే ఆలోచ‌న‌ కృష్ణ కుమార్‌కు వ‌చ్చింది. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఫారమ్‌ను నింపి పంపించాడు. అక్కడ కూడా కృష్ణ కుమార్ బిష్ణోయ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఉన్నత చదువు కోసం స్కాలర్‌షిప్ కు ఎంపికయ్యారు.

రూ. 40 లక్షల స్కాలర్‌షిప్‌తో..
ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి రూ. 40 లక్షల స్కాలర్‌షిప్ పొందారు. ఆ తర్వాత 2015లో పారిస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. దీని తర్వాత ది ఫ్లెచర్ స్కూల్‌లో కూడా విద్యనభ్యసించాడు.

రూ.30 లక్షల జీతంతో..

krishan bishnoi ips success story

చదువు తర్వాత.. కృష్ణ కుమార్ బిష్ణోయ్‌కు ఐక్యరాజ్యసమితి ట్రేడ్‌ సెంటర్‌లో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయితే అక్కడ సుమారు ఏడాది పాటు ఉద్యోగం చేసి, తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. భారత్ కు తిరిగి వచ్చారు. 

ఎటువంటి కోచింగ్ లేకుండానే..

krishan bishnoi ips story

ఇక్కడ కృష్ణ కుమార్ జేఎన్‌యూ(JNU) నుంచి ఎంఫిల్ చేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేయడం ప్రారంభించారు. తర్వాత అతనికి ఐపీఎస్‌ అధికారి కావాలనే కోరిక పుట్టింది. ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ ద్వారా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) నిర్వ‌హించే సివిల్స్‌కు ప్రిపేర్ కావడం మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో కేవలం 24 ఏళ్లకే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌ అయ్యారు కృష్ణ కుమార్ బిష్ణోయ్‌.

రాళ్లు రువ్వడమే కాదు పలు వాహనాలకు..

krishan bishnoi ips inspire story in telugu

2018 బ్యాచ్‌కి చెందిన ఈ IPS అధికారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అత్యంత డైనమిక్, పవర్‌ఫుల్ ఆఫీసర్‌లలో ఒకరు. అతను చాలా భయంకరమైన నేరస్థుల ఆటను అరికట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుకు సంబంధించి కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. సర్వే విషయమై మసీదులో జనం తోపులాట సృష్టించారు. జనం పోలీసు బృందంపై రాళ్లు రువ్వడమే కాదు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో ఓ యువకుడు కూడా చనిపోయాడు. ఇంతలో ఈ గలాటాను నియంత్రించడానికి వచ్చిన సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడి భవిష్యత్తును వృధా చేసుకోవద్దని బృందంలోని హింసకు పాల్పడుతున్న యువకులకు వివరించారు. అలాగే వివిధ ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల్లో కీల‌క పాత్ర పోషించారు ఈ డైన‌మిక ఐపీఎస్ ఆఫీస‌ర్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.

Published date : 25 Nov 2024 08:21PM

Photo Stories