Skip to main content

IAS Jaya Ganesh Success Story : ఒక‌ప్పుడు వెయిట‌ర్‌గా.. యూపీఎస్సీలో 6 ప్ర‌య‌త్నాలు విఫ‌లం.. ఇది కూడా వ‌ద్ద‌నుకొని.. చివ‌రికి!

ఎవ్వ‌రైనా, ఎలాంటివారైనా గెలుపుకు అంత సులువుగా చేరుకోలేరు. ఎంత చిన్నవారైనా, పెద్ద‌వారైనా క‌ష్టం, ఆత్మ విశ్వాసం ఉండాల్సిందే.
Hotel waiter jaya ganesh successful and inspirational journey as ias officer

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ల‌క్ష్యాన్ని సాధించే వ్య‌వ‌ధిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వాట‌న్నింటిని ఎదుర్కొని నిల‌బ‌డి ముందుకు వెళ్లేంత స‌మ‌ర్థులై ఉండాలి. ఎంతో క‌ష్ట‌ప‌డ్డా స‌రే గెలుపు మ‌న‌కు ప‌క్కనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది కాని, చాలా దూరంలో ఉంటుంది. దానిని ద‌క్కించుకోవాలంటే ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌గ‌ల‌ను అనే సంక‌ల్పం ఉండాలి. ఇటువంటి చాలా స‌మ‌స్య‌లు, అయోమ‌యాలు, ఇబ్బందులు, ఒత్తిడి, వంటివి ఎదుర్కొని చివ‌రికి గెలుపును అందుకున్న వారిలో ఒక‌రు ఈ ఐఏఎస్ ఆఫీసర్‌. ఇత‌నే జ‌య గ‌ణేష్‌.. ఇత‌ని ప్ర‌యాణం, గెలుపు, క‌ష్టం వంటివి త‌న జీవితంలో ఎంత ఆనందాన్ని తీసుకొచ్చాయో తెలుసుకుందాం..

AP TET 2024 Ranker Success Story : జస్ట్‌మిస్‌... ఏపీ టెట్‌లో 149.99/150 కొట్టానిలా.. కానీ..

కుటుంబం.. చ‌దువు..

జ‌య గ‌ణేష్.. తమిళనాడు ఉత్తర అంబర్ సమీపంలో వెల్లూరు జిల్లాలోని విన్వమంగళం అనే చిన్న గ్రామంలో పుట్టిన వ్యాక్తి. అక్క‌డే త‌న చ‌దువు, జీవితం గ‌డిచింది. ఇత‌ని తండ్రి ఒక కర్మాగారంలో కార్మికుడు, కుటుంబంలో ఏకైక రొట్టె సంపాదించేవాడు. నాలుగు పిల్ల‌లున్న ఈ తండ్రికి పెద్ద కుమారుడు జ‌య గ‌ణేష్‌. ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చాలానే ఉన్నాయి. గ‌ణేష్ త‌న ప్రాథమిక చ‌దువును త‌న సొంత గ్రామంలోనే పూర్తి చేసుకున్నారు.

Follow our YouTube Channel (Click Here)

త‌రువాత‌, ఇంట‌ర్మీడియ‌ట్‌.. ఇందులో 91 శాతం స్కోరు సాధించాడు. అనంత‌రం, ఐటీఐలో సీటు సాధించి, అందులో చేరి ఉన్నతంగా రాణించారు. ఇక్క‌డితో ఆగ‌కుండా తంతి పెరియార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించి ఇందులో కూడా ఉన్న‌తంగా రాణించాడు. చివ‌రికి, చేతిలో 2 డిగ్రీలు ప‌ట్టుల‌కున్నారు గ‌ణేష్‌.

ఆర్థిక ఇబ్బందులు

చిన్న‌త‌నం నుంచే పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూనే న‌లుగులు పిల్ల‌లు త‌మ చ‌దువుల‌ను పూర్తి చేసుకున్నారు. పెద్ద‌వాడైన జ‌య గ‌ణేష్‌కు తెలివితేట‌లు చాలా ఎక్కువ‌. ఎప్పుడూ కుటుంబానికి క‌ష్టం రాకుండా చూడాల‌నేదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏం చేసైనా స‌రే ఇబ్బందుల నుంచి సంతోషానికి చేరుకోవాల‌ని కష్ట‌ప‌డేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి త‌న తండ్రికి స‌హాయ‌ప‌డేవాడు.

AP TET Top Ranker Ashwini Success Story : పెదింటి బిడ్డ‌.. టెట్ ఫ‌లితాల్లో 150/150 మార్కులు కొట్టిందిలా.. కానీ ల‌క్ష్యం ఇదే...!

యూపీఎస్సీ ప్ర‌య‌త్నాలు.. వెయిట‌ర్‌గా ఉద్యోగం!

త‌న రెండు డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల‌కు ప్ర‌య‌త్నించాడు.. చిన్న ఉద్యోగం దొరికింది కాని, జీతం 2500 కావ‌డంతో ఇల్లు, వారి జీవితాలు గ‌డవ‌డం క‌ష్టం కావ‌డంతో పెద్ద‌గా ప్ర‌య‌త్నించాల‌ని నిర్ణ‌యించుకొని చివ‌రికి ఉద్యోగాలేవి వ‌ద్ద‌నుకున్నాడు. ఒకేసారి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాడు. దాని కోసమే రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ ప్ర‌య‌త్నాల్లోనే 7 సార్లు విఫ‌లం అయ్యాడు. అయితే, ప్రిలిమ్స్‌లో లేదా మెయిన్స్‌లో వెనుక‌బ‌డేవాడు. దీంతో చాలా కృంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు పెర‌గ‌డంతో ఈ ఆశ‌ల‌ను ఆపేసి ఒక హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేయ‌డం ప్రారంభించాడు. కొన్ని రోజుల‌పాటు ఇలా గడిపేసాడు. 

Follow our Instagram Page (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఉద్యోగమా..  యూపీఎస్సీనా..?

త‌న ప్ర‌య‌త్నాల‌ను ఆపేసినా, త‌న ఆలోచ‌న‌లు మాత్రం ఆగ‌లేదు. ఎలాగైనా స‌రే ఎంత కృంగిపోతున్న‌ప్ప‌టికి యూపీఎస్సీ సాధించాల‌ని ప‌ట్టుద‌ల ఏమాత్రం వ‌ద‌ల్లేదు. తిరిగి మ‌రోసారి అవ‌కాశం వ‌చ్చిన్న‌ప్పుడు జయగణేషకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇక్క‌డే ఏం చేయాలో అయోమ‌యంలో ప‌డ్డాడు. ఒక‌వైపు అనుకున్న ఐఏఎస్ ప‌రీక్ష మ‌రోవైపు ఒక్క అడుగులోనే ఉద్య‌గం. యూపీఎస్సీ రాస్తే ఉద్యోగం వ‌స్తుందో లేదో తెలీదు. చేసిన 6 ప్రయ‌త్నాలు విఫ‌లం అయ్యాయి ఇది ఎటు దారి తీస్తుందో తెలీదు. ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవాలో తెలీయ‌లేదు. ఎన్నో భ‌యాలు ఉన్న‌ప్ప‌టికీ త‌న క‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. 

Success Story : తీవ్రమైన పోటీని తట్టుకొని.. ఒకే సారి నాలుగు గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌లు కొట్టానిలా... కానీ..!

7వ ప్ర‌యాత్నంలో..

త‌న‌ను వెత్తుకుంటూ వ‌చ్చిన ఉద్యోగాన్ని కాద‌నుకొని కొన్నిసార్లు విఫ‌లమైన యూపీఎస్సీనే ఎంచుకున్న గ‌ణేష్ త‌న ప‌రీక్ష‌ల‌కు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా, ఒక‌వైపు ఇంటి కోసం క‌ష్టప‌డుతూనే మ‌రోవైపు త‌న ల‌క్ష్యాన్ని చేరుకునే ప‌నిలో ఉండేవాడు. చివ‌రి ఘ‌ట్టం రానేవ‌చ్చింది. ఈసారి ఒక మెట్టు ఎక్కిన తృప్తి లభించింది. ఎందుకంటే, త‌న ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌లో నెగ్గి 156వ ర్యాంకును సాధించాడు. ఇక మిగిలింది ఇంట‌ర్వ్యూ. చివ‌రికి, ఈ ఘ‌ట్టంలో కూడా పాసై  త‌న క‌ష్టాల‌ను ఫలితాన్ని ద‌క్కించ‌కున్నాడు. సాధారణ జ‌య గ‌ణేష్ నేడు ఐఏఎస్ జ‌య గ‌ణేష్‌గా గెలిచాడు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న త‌న కుటుంబం ఆనందానికి పరిమితుల్లేవు. 

Join our WhatsApp Channel (Click Here)

Published date : 09 Nov 2024 09:13AM

Photo Stories