Skip to main content

Graduated Students : డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కూడా ఈ ప‌రీక్ష‌కు అర్హులు..

యూపీఎస్సీ.. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్. ఈ ప‌రీక్ష రాస్తే ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి ఉన్న‌త స్థాయిలో గౌర‌వ హోదాలో స్థానం సాధిస్తారు.
Graduated and final year students also eligible for upsc civils   UPSC Civil Services Exam Information   UPSC Exam Eligibility Criteria

సాక్షి ఎడ్యుకేష‌న్: యూపీఎస్సీ.. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్. ఈ ప‌రీక్ష రాస్తే ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి ఉన్న‌త స్థాయిలో గౌర‌వ హోదాలో స్థానం సాధిస్తారు. అయితే, గతంలో అంటే.. 2024వ‌ర‌కు కూడా కేవ‌లం వయోపరిమితి ఆధారంగా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. 

ఫిబ్ర‌వరి 11వ తేదీ వ‌ర‌కు..

జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌కు కేల‌వం, 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వ‌ర‌కు ఉన్న యువ‌తి యువ‌కుల‌కు మాత్ర‌మే అర్హ‌త ఉండేది. కాని, దీనితోపాటు ఇప్పుడు విద్యార్హ‌త కూడా తోడైంది. అభ్య‌ర్థులు డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులు కూడా సివిల్స్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు అర్హుల‌ని, వారు కూడా ఈ పరీక్ష‌కు ద‌రఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని తేల్చేసారు.

Webinar: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం..'సాక్షి ఎడ్యుకేషన్'‌ ప్రత్యేకంగా..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు పి ఎస్ సి) నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఫిబ్రవరి 11 వరకు ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు. పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ ప్ర‌క‌టించారు.

ఉన్న‌త ఉద్యోగ యోగం..

భార‌త స్థాయిలో ప్ర‌తీ ఏటా నిర్వహించే ఈ ఉన్నత స్థాయి పరీక్షపై విద్యార్థులకు కూడా కావాల్సిన‌ అవగాహన ఉంటుంద‌ని అభిప్రాయపడ్డారు ర‌ఘునంద‌న్‌. అభ్య‌ర్థులకు కృషి, పట్టుదల, అద్భుత ప్రతిభ ఉంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమవుతుంద‌ని “మాచన” ఆశా భావం వ్యక్తం చేశారు. సివిల్స్ మనకు సాధ్యమా?! అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న ఆత్మ విశ్వాసం ప్ర‌తీ విద్యార్థిలో ఉండాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 08:28AM

Photo Stories