Skip to main content

UPSC CAPF AC Notification 2025 : యూపీఎస్సీ సీఏపీఎఫ్ ఏసీ 2025 నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన తేదీలివే..

సెంట్ర‌ల్ ఆర్మడ్ పోలీస్‌ ఫోర్సెస్‌లోకి వెళ్లాల‌నుకుంటున్నారా.. అయితే, ఇది మీకు గొప్ప అవ‌కాశం. మీకు ఉండాల్సిన అర్హ‌త‌లు, ఆస‌క్తి ఉంటే ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.
UPSC CAPF Assistant Commandant Notification 2025   Apply for UPSC CAPF Group-A Posts  UPSC CAPF AC exam notification 2025 with posts details and applications

సాక్షి ఎడ్యుకేష‌న్: సెంట్ర‌ల్ ఆర్మడ్ పోలీస్‌ ఫోర్సెస్‌లోకి వెళ్లాల‌నుకుంటున్నారా.. అయితే, ఇది మీకు గొప్ప అవ‌కాశం. మీకు ఉండాల్సిన అర్హ‌త‌లు, ఆస‌క్తి ఉంటే ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.

గ్రూప్‌-ఏ లోని పోస్టుల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు యూపీఎస్సీ సీఏపీఎఫ్ (అసిస్టెంట్ క‌మాండెంట్‌) ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు అధికారులు. బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, మరియు ఎస్‌ఎస్‌బి వంటి రంగాల్లో మొత్తం 357 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివ‌రాలు..

SSC Stenographer Results 2024 Out: SSC స్టెనోగ్రాఫర్ ఫైనల్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

1. బీఎస్ఎఫ్: 24 పోస్టులు
2. సీఆర్‌పీఎఫ్‌: 204 పోస్టులు
3. సీఐఎస్ఎఫ్‌: 92 పోస్టులు
4. ఐటీబీపీ: 04 పోస్టులు
5. ఎస్ఎస్‌బీ: 33 పోస్టులు

విద్యార్హ‌త‌లు: భారతదేశంలోని కేంద్రం లేదా రాష్ట్రం శాసనసభ చట్టం ద్వారా విలీన‌మైన‌ విశ్వవిద్యాలయం లేదా పార్లమెంటు చట్టంతో స్థాపించిన‌ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956లోని సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఇతర విద్యా సంస్థల నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

Army Jobs: ఎన్‌సీసీతో ఆర్మీ కొలువు.. నెలకు రూ.56,100 జీతం!

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫీషియ‌న్సీ టెస్ట్‌, శారీరక సామర్థ్య పరీక్షలు (PET), వైద్య ప్రమాణాల పరీక్షలు, చివ‌ర‌గా ఇంట‌ర్వ్యూ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో.. https://www.upsconline.nic.in

ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ: మార్చి 25, 2025

ప‌రీక్ష తేదీ: ఆగ‌స్ట్ 3, 2025

మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తూ ఉండండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Mar 2025 03:34PM
PDF

Photo Stories