Skip to main content

AP Mega DSC Notification Released : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం 16,347 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు నేడే ప్రారంభం.. ముఖ్య‌వివరాలు ఇవే..

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ (AP DSC) షెడ్యూల్‌ విడుదలైంది.
AP Mega DSC notification released with posts and application details   CM Chandrababu Naidu birthday announcement  AP DSC 2025 notification released

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌లాది నిరుద్యోగులు, ఉపాధ్యాయ పోస్టుల‌కు ఎదురుచూస్తున్నవారి నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా భారీ శుభ‌వార్త అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఉపాధ్యాయ ఉద్యోగార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ శుభవార్తను వెల్ల‌డించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వ‌యంగా మెగా డీఎస్సీ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ షెడ్యూల్‌ను 19వ తేదీన, శనివారం రాత్రి ప్రకటించగా, నేడు.. ఏప్రిల్ 20వ తేదీన అధికారికంగా విడుద‌ల చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న అభ్య‌ర్థులంతా ఎట్ట‌కేల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు.

TG EAPCET 2025 Hall Tickets Released: టీజీ ఈఏపీసెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల.. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి!

ఇక‌, కూటమి ప్ర‌భుత్వం త‌మ మ్యానిఫెస్టోలోని కీలక హామీని సీఎం పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇక‌, ఈ నోటిఫికేష‌న్‌తో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అంతేకాదు, ఈ నోటిఫికేష‌న్‌తోపాటు ప‌రీక్ష‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేశారు అధికారులు. ఇక‌, ఈ విష‌యాన్ని సర్కార్ త‌మ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అభ్య‌ర్థులు, నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను సైతం పాఠ‌శాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప‌రిశీలించుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తులు, షెడ్యూల్ వివ‌రాలు..

ప‌రీక్ష విధానం- ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తుల ఫీజు, తేదీలు- ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు.

మాక్ టెస్ట్‌- మే 30వ తేదీ

హాల్‌టికెట్- మే 30వ తేదీన విడుద‌ల‌

JEE Mains 2025లో బిసి గురుకుల విద్యార్థుల విజయభేరీ!

మెగా డీఎస్సీ ఆన్‌లైన్ ప‌రీక్షలు- జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వ‌ర‌కు.. నెల రోజుల ప‌రీక్ష‌

డీఎస్సీ ప్రాథమిక కీ- ప‌రీక్ష‌లు ముగిసిన రెండో రోజు.. జులై 8వ తేదీ

కీ అభ్యంతరాలు- కీ విడుద‌లైన త‌రువాత‌, ఏడు (7) రోజుల వ‌ర‌కు

ఫైన‌ల్ కీ- అభ్యంత‌రాలు ముగిసిన ఏడు (7) రోజుల‌కు

మెరిట్ జాబితా- మ‌రో ఏడు (7) రోజుల‌కు విడుద‌ల చేస్తారు.

Private Schools : పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు

అభ్య‌ర్థులు ఎంతో ప‌ట్టుద‌ల‌తో, ఎంతో ఓర్పుతో చాలా రోజుల‌నుంచి ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ నేడు విడుద‌లైంది. అంతేకాకుండా, ద‌ర‌ఖాస్తులు కూడా నేడే ప్రారంభం కావడం విశేషం. ఇక‌, అభ్య‌ర్థులు ఏమాత్రం ఆల‌స్యం చేయకుండా త‌మ‌కు వ‌చ్చిన గొప్ప అవ‌కాశాన్ని వినియోగించుకుని ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేయండి. మ‌రిన్ని వివ‌రాలు, పూర్తి అవ‌గాహ‌న కోసం కింద ప్ర‌క‌టించిన ఏపీ మెగా డీఎస్సీ నోటిపికేష‌న్‌ను ప‌రిశీలించుకోండి.. లేదా పాఠ‌శాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

ద‌ర‌ఖాస్తుల విధానం..

1. మొద‌ట‌, పాఠ‌శాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. https://apdsc.apcfss.in/#

2. కింద కనిపిస్తున్న రిజిస్ట్రార్ న‌వ్‌పై క్లిక్ చేస్తే.. మ‌రో పేజీలో పైన భాగంలో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

Regional Languages for Engineering : 12 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలు.. 10 నిమిషాల్లో తర్జుమా

3. క‌నిపిస్తున్న వివ‌రాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వండి.

4. త‌రువాత‌, మ‌రో పేజీలో అప్లికేష‌న్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అక్క‌డ అడిగిన‌, కావాల్సిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వండి. ఫీజును కూడా చెల్లించి, ఫార్మ్‌ను పూర్తిగా ప‌రిశీలించుకోండి. (త‌ప్పుడు స‌మాచారం, లేదా అవ‌స‌ర‌మైన వివరాల‌ను న‌మోదు చేయ‌క‌పోతే వాటిని స‌రి చేయండి).

5. చివ‌రిగా, మీ ఫార్మ్‌ను ప్రింట్ తీసుకోండి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Apr 2025 09:01AM
PDF

Photo Stories