Kajal Jawla IAS Officer Real Life Story : రూ.23 లక్షలు జీతం వచ్చే జాబ్‌కు రాజీనామా చేశా... ఎందుకంటే...?
ఈ పరీక్షల్లో దేశవ్యాప్తం ఎంతో మంది యువత తీవ్రంగా పోటీపడుతుంటారు. అందరికీ గొప్ప గొప్ప కలలు, లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి. అయితే వాటిని సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. క్రమశిక్షణ, సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధానకు కృషి చేస్తూ అనుకున్నది సాధిస్తారు. హర్యానాకు చెందిన కాజల్ జావ్లా ఇదే కోవకు చెందుతారు. ఈమె యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో కాజల్ జావ్లా ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఎడ్యుకేషన్ :
కాజల్ జావ్లా.. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 2010లో బీటెక్ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నారు.
రూ.23 లక్షల జీతంకు రాజీనామా చేసి..
ఆ తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం సాధించారు. రూ.23 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేశారు. అయితే మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే తన సంకల్పాన్ని ఆమె వదులుకోలేదు. ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే... ఖాళీ సమయంలో యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు. అలా తొమ్మిదేళ్ల పాటు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు. రోజూ తొమ్మిది గంటల పాటు డ్యూటీ చేసి.., మిగతా సమయంలో సివిల్స్ ప్రిపరేషన్‌కు కేటాయించారు. యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేయాలనే లక్ష్యాన్ని ఈమె ఐదో ప్రయత్నంలో అందుకున్నారు కాజల్ జావ్లా.
నా భర్త వల్ల..
లక్షల రూపాలయలు వచ్చే జీతాన్ని వదులుకుని ఐఏఎస్ అవ్వాలనే తన కలను సాధించారు. ఈ ప్రయాణంలో ఆమెకు తన భర్త అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉన్నారు. భార్య సక్సెస్‌లో తాను కూడా భాగంగా ఉన్నారు. ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు తన భర్త ఆశిష్ మాలిక్ సపోర్ట్‌గా ఉంటూ.. ఇంటి వ్యవహారాలను చూసుకున్నారు.
ఈయన ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో ఉద్యోగం చేస్తున్నారు. వంట చేయడం నుంచి ఇళ్లు క్లీన్ చేయడం వరకు అన్ని రకాల పనులు చేస్తూ భార్య ప్రిపరేషన్‌కు తగిన సమయం కల్పించారు.
తొలి వైఫల్యానికి కారణం ఇదే..
ఈ సందర్భంగా కాజల్ జావ్లా ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సమయం చాలా కీలకం. ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేకపోవడమే అని అన్నారు.
ఎలాంటి కోచింగ్ లేకుండానే..
నా ఐఎస్ఎస్ ప్రిపరేషన్ కోసం కాజల్ ఎప్పుడు కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడలేదు. సొంతంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేశారు. కాజల్ డ్యూటీ అయిన తరువాత రోజూ క్యాబ్‌లో ఇంటికి వస్తారు. ఇలా దాదాపు మూడు గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని కూడా ప్రిపరేషన్ కోసం కేటాయించేవారు.
నాకు ఇదే పెద్ద సవాలుగా మారింది...
అయితే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నా... మెయిన్స్ క్లియర్ చేయడం ఆమెకు సవాలుగా మారింది. వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయినా పట్టుదల వదలకుండా ప్రిపరేషన్ కొనసాగించారు. చివరికి ఐదో ప్రయత్నంలో 2018లో యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ కలను నిజం చేసుకున్నారు. ఎలాంటి నిరుత్సాహాం లేకుండా... ఓటమి ఎదురైన ముందుకు సాగితే.. ఎదో ఒక రోజు విజయం మీ సొంతం అవ్వడం ఖాయం.
Tags
- UPSC Civils Ranker Success Story
- UPSC Civils Ranker Success Stories in Telugu
- upsc civils ranker success story telugu
- upsc civils ranker success story in telugu
- Kajal Jawla IAS Officer
- Kajal Jawla IAS Officer Success Story
- Kajal Jawla IAS Officer Success Storr
- Kajal Jawla IAS Officer Inspire Story
- Kajal Jawla IAS Officer Inspire Story in Telugu
- Kajal Jawla IAS Officer Real Life Story
- Kajal Jawla IAS Officer Real Life Story in Telugu
- Kajal Jawla IAS Officer UPSC Civil Ranke
- Kajal Jawla IAS Officer News in Telugu
- Kajal Jawla IAS Officer Motivational Story in Telugu
- sakshieducationsuccess story