Skip to main content

HS Keerthana IAS Stroy : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క‌లెక్ట‌ర్‌.. ఈ నటి సక్సెస్ జ‌ర్నీ మాత్రం విచిత్రమే..! ఎందుకంటే..?

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) నిర్వ‌హించే.. సివిల్స్ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే... ఎంతో ప‌ట్ట‌ద‌ల‌తో శ్ర‌మించాల్సి ఉంటుంది. అలాగే ఒక్క ప‌క్కా ప్లానింగ్‌తో చ‌ద‌వాలి. కానీ హెచ్ఎస్ కీర్తన ఒకప్పుడు బాల నటించి.., ఇప్పుడు ఆమె ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు.
HS Keerthana IAS Success Story

ఈమె త‌న ల‌క్ష సాధ‌న కోసం.. సినిమా ప్రపంచానికి దూరంగా ఉండి.. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు ప్రిప‌రేష‌న్ చేశారు.ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో ఛాలెంజ్‌ల‌ను ఎదుర్కొంది. నేడు ఎట్ట‌కేల‌కు యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి.. ఏకంగా క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించింది. ఈ నేప‌థ్యంలో..  నాటి సినిమాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన‌.. ఈమె స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజున క‌లెక్ట‌ర్ అయ్యారిలా..

HS Keerthana IAS Real Life Story

సినిమాల్లోకి వస్తే అక్కడే జీవితం కొనసాగుతుంది.. అక్కడే ముగిసిపోతుంది అనుకుంటారు కొందరు. అలాగే సినిమా ఫీల్డ్‌ని చిన్న చూపు చూస్తూంటారు మరికొందరు కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఒక్కోసారి కావాల్సిన ప్రేరణ ఇవ్వగలుగుతుంది. అలా చాలా మంది నటులు నిజ జీవితంలో డాక్టర్స్ గా, ఇండస్ట్రలియస్ట్ గా, టీచర్స్ గా, లెక్చరర్స్ గా సెటిలయ్యారు. అలాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజున ఐఏఎస్ కు ఎంపికై చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..

ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా..

HS Keerthana IAS Success Story in Telugu

హెచ్ఎస్ కీర్తన చిన్నప్పుడు అంటే కొంతకాలం క్రితం  ఒక పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతోపాటు కన్నడ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.  'కర్పూరద గొంబే', 'గంగా-యమునా', 'ముద్దిన అలియా','ఉపేంద్ర','ఎ', 'కానూరు హెగ్గదాటి', 'సర్కిల్ ఇన్‌స్పెక్టర్', 'ఓ మల్లిగే', 'లేడీ కమీషనర్', 'హబ్బ', 'దొరే', 'సింహాద్రి', 'జనని','చిగురు', 'పుటాని ఏజెంట్','పుతని' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. వరస అవకాశాలతో బిజిగా ఉన్నా ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. 

➤☛ UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

ఐదుసార్లూ ఈమె యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్‌.. అయినా కూడా..

HS Keerthana Inspire Stroy in Telugu

యూపీఎస్సీ సివిల్స్‌ మొదటి  ప్రయత్నంలో ఫెయిలైంది. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ఐదుసార్లూ ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఆరవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది. తన మొదటి పోస్టింగ్ కోసం కర్ణాటకలోని మాండ్యా జిల్లాను ఎంచుకుంది. అసిస్టెంట్ కమిషనర్ అపాయింట్ అయ్యింది. ఇక ఐఏఎస్ అధికారి కావడానికి ముందు, 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షకు హాజరైంది. దానిని క్లియర్ చేసిన తర్వాత, ఆమె రెండు సంవత్సరాలు KAS ఆఫీసర్‌గా పనిచేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. 

అనేక ఛాలెంజ్‌ల‌ను ఎదుర్కొని.. నేడు..

HS Keerthana IAS news in Telugu

ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను కొనసాగిస్తూ తన నటనా జీవితాన్ని బాలెన్స్ చేసుకుంది. ఈ క్రమంలో అనేక ఛాలెంజ్ లను ఎదుర్కొన్నప్పటికీ, సంకల్పం, కృషి ఉంటే తాము అనుకున్నది సాధించవచ్చని, తమ కలలను సాకారం చేసుకోవచ్చని హెచ్ఎస్ కీర్తన ప్రూవ్ చేసింది. 

Published date : 09 Sep 2024 03:03PM

Photo Stories