UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..
ఈయన గతేడాది 217 ర్యాంకు రాగా, ఐపీఎస్ సాధించాడు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మి గృహిణి. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన కొయ్యడ. జయసింహారెడ్డి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటివద్దనే ఉంటూ నాల్గవ ప్రయత్నంలో సివిల్స్ రాశారు.
ఎడ్యుకేషన్ :
పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్‌ఆర్ ఎడ్యు స్కూల్‌లో చదివారు. హైదరాబాద్ శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. అనంతరం రెండున్నల నెలల పాటు స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాలో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించాడు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104 ర్యాంకు సాధించారు.
నా లక్ష్యం ఇదే..
రైతులు, ప్రజలకు సేవ చేసేందుకు ఐఏఎస్ ఉద్యోగం ద్వారా ఎక్కువ అవకాశాలుంటాయని భావించి సివిల్స్ వైపు వెళ్లాను. గతంలో వచ్చిన ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. ఐఏఎస్‌కు ఎంపిక కావాలనే లక్ష్యంతో మరోసారి సివిల్స్‌కు హాజరయ్యా. ఈ సారి గతంలో కంటే మెరుగైన ర్యాంకు వచ్చింది. ఈ సారి ఐఏఎస్‌కు ఎంపికవుతాననే ఆశలున్నాయి. అవకాశం రాకపోతే గతంలో వచ్చిన ఐపీఎస్‌లోనే కొనసాగుతానని జయసింహారెడ్డి తెలిపారు.
Tags
- UPSC Civils Ranker Success Story
- UPSC Civils Ranker Inspire Story in Telugu
- Ravula Jayasimha Reddy UPSC Civils Ranker
- Ravula Jayasimha Reddy UPSC Civils Ranker Success Stroy
- UPSC Civils Ranker Ravula Jayasimha Reddy Education
- UPSC Civils Ranker Details in Telugu
- UPSC Civils Ranker Real life Story
- UPSC Civils Ranker IPS
- UPSC Civils Ranker Ravula Jayasimha Reddy Success Story in Telugu
- UPSC Civils 104th Ranker Ravula Jayasimha Reddy
- UPSC Civils 104th Ranker Ravula Jayasimha Reddy Success Story
- UPSC Civils 104th Ranker Ravula Jayasimha Reddy Real Life Story
- UPSC Civils 104th Ranker Ravula Jayasimha Reddy Inspire Story
- Competitive Exams Success Stories
- Ias Officer Success Story
- ips officer success story