TSPSC AEE Final Results 2024: నిరుపేద కుటుంబం, ఎలాంటి కోచింగ్ లేకుండానే ఏఈఈ ఉద్యోగం సాధించిన రాజశేఖర్
Sakshi Education
కడెం: మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మి–నర్సయ్య దంపతుల కు మారుడు రాజశేఖర్ పీ ఆర్ ఏఈఈగా ఎంపికయ్యాడు. నిరుపేద కు టుంబానికి చెందిన రాజశేఖర్ మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు.
ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఫ్రీ సీటు సంపాదించి ఇంటర్ చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్ చదివాడు. సొంతంగా ప్రిపేరయ్యాడు.
గ్రూప్–4, టౌన్ ప్లానింగ్ అధికారి, జూనియర్ టెక్నికల్ అఫీసర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి 1:1 అర్హత సాధించాడు. ఈ ఉద్యోగాల తుది ఫలితాలు వెలువడాల్సి ఉంది. కాగా, ఏఈఈ గా ఎంపికైన రాజశేఖర్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
Published date : 06 Aug 2024 08:14AM
Tags
- AEE
- Assistant Executive Engineer
- Assistant Executive Engineer jobs
- Civil Engineering
- Civil Engineering jobs
- Government Jobs
- TS government jobs
- Job announcement
- sakshieducationsuccess stories
- Latest Government Job News
- Govt Jobs
- Telangana Govt Jobs 2024
- Kadem
- DurgamLakshmi
- PRAEE selection
- sakshieducationsuccess story