Skip to main content

Sucess Story Of Manoj Kumar: మధ్యతరగతి కుటుంబం.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన మనోజ్‌కుమార్‌

Success Story Of Manoj Kumar

కమలాపూర్‌: ఒక ఉద్యోగం సాధించడానికే అహర్నిశలు కష్ట పడుతున్న ఈ రోజుల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం కన్నూరు గ్రామానికి చెందిన వెన్నంపల్లి మనోజ్‌కుమార్‌ ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెన్నంపల్లి శంకరయ్య–లలిత దంపతుల రెండో కుమారుడు మనోజ్‌కుమార్‌ హనుమకొండలోని స్ఫూర్తి హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు.

హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌, నాగపూర్‌ ఎన్‌ఐటీలో ఎంటెక్‌ చేసి ఉద్యోగ వేట ప్రారంభించాడు. సుమారు రెండు, మూడు నెలల క్రితం అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ), టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌(టీపీబీఓ), గ్రూప్‌–4 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈనెల 4న తాజాగా ఆర్‌ అండ్‌బీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగం వచ్చింది.

Woman Sucess Story: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ కూతురు

అయితే.. తనకిష్టమైన ఆర్‌అండ్‌బీలో ఏఈఈ ఉద్యోగంలో చేరబోతున్నట్లు మనోజ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాగా.. మనోజ్‌కుమార్‌ సోదరుడు నటరాజ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసాయ శాఖలో సైంటిస్ట్‌గా, సోదరి అఖిల కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(ఏఈఓ)గా ఉద్యోగాలు చేస్తున్నారు.
 

Published date : 06 Aug 2024 03:44PM

Photo Stories