CAG: కాగ్ చీఫ్‌గా నియమితులైన సంజయ్ మూర్తి
ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న మూర్తి, 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అధికారిగా గుర్తింపు పొందారు.
ఈ మేరకు సంజయ్‌మూర్తి నియామకంపై కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం CAGగా కొనసాగుతున్న గిరిష్ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్ 20, 2024తో ముగియనుంది. దీంతో చంద్ర ముర్ము స్థానంలో సంజయ్ మూర్తీ కొత్త CAGగా బాధ్యతలు చేపట్టనున్నారు.
CAGగా మూర్తీ నియమితయ్యాక, ఆయన భారత ప్రభుత్వ ఖాతాలపై ఆడిట్ నిర్వహించడం, ప్రజా ఖర్చులపై పారదర్శకతను తీసుకువెళ్లడం, ఆర్థిక అవినీతిని నిరోధించడం వంటి కీలక బాధ్యతలు ఉంటాయి.
సంజయ్ మూర్తి చరిత్ర..
ఆయన తండ్రి కేఎస్‌ఆర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు.
సంజయ్ మూర్తీ 1964 డిసెంబర్ 24న జన్మించారు. 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌లో ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు. 2021 సెప్టెంబర్ నుండి జాతీయ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మూర్తీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉన్న మూర్తీ, తాజా నిర్ణయం ప్రకారం, జీ20 శిఖరాగ్ర సమావేశం తరువాత CAGగా బాధ్యతలు స్వీకరించనున్నారు. CAGగా అతను బాధ్యతలు చేపట్టే తొలి తెలుగు అధికారిగా కూడా నిలవనున్నారు.
AAI Chairman: ఏఏఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విపిన్ కుమార్
CAG యొక్క విస్తృత అధికారం..
CAG అనేక కీలక సంస్థలు, శాఖలను ఆడిట్ చేసే అధికారం కలిగి ఉంటుంది. అందులో రైల్వే, రక్షణ, ఇండియా పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. భారతదేశంలోని 1500 పైగా ప్రభుత్వ వాణిజ్య సంస్థలు, 400కి పైగా స్వయంప్రతిపత్తి సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలను కూడా CAG ఆడిట్ చేస్తుంది.