IAS & IPS Officers: మనోళ్లు.. ఐఏఎస్, ఐపీఎస్‌లు.. ఆ అధికారులపై ప్రత్యేక కథనం..
ఢిల్లీలోని ఉత్తర జిల్లా డీసీపీ అంజిత
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీకి చెందిన చెప్యాల సత్యనారాయణ–మంగ దంపతుల కుమార్తె అంజిత బీటెక్ చదివారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఘట్‌కేసర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఓ మహిళను ఆదర్శంగా తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2008లో ఐపీఎస్ సాధించారు.
ఢిల్లీలోని ఉత్తర జిల్లా డీసీపీగా(ఎర్రకోట, చాందినీ చౌక్, సదర్ బజార్ వంటి ప్రసిద్ధ మార్కెట్లు ఉన్న ఏరియా) విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నేడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అందరూ ఉన్నత విద్యనభ్యసించాలని సూచించారు. నిరంతర శ్రమ, పుస్తక విజ్ఞానం,ఏకాగ్రత, క్రమశిక్షణ ఉంటే విజయం చేరువవుతుందని తెలిపారు.
చదవండి: Woman Sucess Story: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ కూతురు
నరహరి.. మధ్యప్రదేశ్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన దర్జీ పరికిపండ్ల సత్యనారాయణ–సరోజ దంపతుల కు మారుడు నరహరి. ఇంజినీరింగ్ చది వారు. 2001లో ఐఏఎస్‌గా మధ్యప్రదేశ్ కే డర్‌కు ఎంపికయ్యారు. ఇండోర్, గ్వాలియ ర్ జిల్లాల కలెక్టర్‌గా, ఆ రాష్ట్ర ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా(జల్ జీవన్ మిషన్)లో పని చేస్తున్నారు. పుట్టిన ఊరు బసంత్‌నగర్‌పై మమకారంతో తన తండ్రి స్మారకార్థం శంకర విజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు.
కూతురు ఆలయ పేరిట ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవలందిస్తున్నారు. యు వతకు శిక్షణ, జాబ్‌మేళాలు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు అమరుస్తున్నారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని, కష్టాన్ని నమ్ముకొని ముందుకుసాగాలని సూ చిస్తున్నారు.
మకరంద్.. మున్సిపల్ కమిషనర్
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ 2020లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా పని చేసిన ఆయన ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు నిర్మల–సురేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఓ ప్రముఖ కంపెనీలో ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో పనిచేసి రాజీనామా చేశారు. యూపీఎస్సీ కోసం సన్నద్ధమై, విజయం సాధించారు. ఐఏఎస్ కావాలనుకునేవారు సమయం వృథా చేయొద్దని, ప్రిపరేషన్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
శివమారుతిరెడ్డి.. ఏఎస్పీగా శిక్షణ
కోరుట్ల: అయిలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి ఏడాది క్రితం సివిల్స్‌లో 132వ ర్యాంకు సాధించాడు. ఒడిశా కేడర్ ఐపీఎస్‌గా ఎంపికై , భువనేశ్వర్‌లో ఏఎస్పీ శిక్షణలో ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు అంజిరెడ్డి–పుష్పలత. అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తనకు ఇష్టమైన వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ట్రెయినింగ్‌లో శారీరక, మానసిక దృఢత్వంతోపాటు ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకుంటున్నానని తెలిపారు. విధుల్లో చేరాక పేదలకు, నిస్సహాయులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు.
కుమార్.. మహారాష్ట్రలో ఎస్పీ
హుజూరాబాద్ రూరల్: మండలంలోని పోతిరెడ్డిపేటకు చెందిన చింత రాములు–శ్యామల దంపతుల పెద్ద కుమారుడు కుమార్ సివిల్స్ రాసి, ఐపీఎస్ గా ఎంపికయ్యారు. రాములు గీత కార్మికుడు. కుమార్‌కు సోదరుడు, సోదరి ఉన్నారు. బీటెక్ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 10కి పైగా ఉద్యోగాలు సాధించానని, సివిల్స్ సాధించడమే లక్ష్యంగా సన్నద్దమయ్యానని, 2015లో ఐఆర్‌ఎస్ సాధించానన్నారు. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాయని, మహారాష్ట్రలోని యవాత్మల్ ఎస్పీగా పని చేస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.
సుధీర్‌బాబు.. రాచకొండ సీపీ
సిరిసిల్ల: తంగళ్లపల్లికి చెందిన గొట్టె సుధీర్‌బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఈయన భూపతి–శాంత దంపతుల పెద్ద కుమారుడు. భూపతి నేరెళ్ల ఎమ్మెల్యేగా, పెద్దపల్లి ఎంపీగా పని చేశారు. సుధీర్‌బాబు ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఏ చదివారు. ఎంఫిల్ పూర్తి చేసి, పీహెచ్‌డీ చేస్తూ 1991లో గ్రూపు–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో తొలి పోస్టింగ్ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేశారు. పదోన్నతుల ద్వారా ఐపీఎస్ హోదా పొంది, మహబూబ్‌నగర్ ఎస్పీగా, హైదరాబాద్ వెస్ట్ జోన్, నార్త్ జోన్ డీసీపీగా, వరంగల్ సీపీ పని చేశారు. ప్రస్తుతం రాచకొండ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అశోక్‌రెడ్డి.. వాటర్ బోర్డు ఎండీ
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టుకు చెందిన కోరెం శ్రీనివాస్‌రెడ్డి–ప్రమీల దంపతుల చిన్న కుమారుడు అశోక్‌రెడ్డి గ్రూప్–1 సాధించారు. పదోన్నతుల ద్వారా 2023 లో ఐఏఎస్‌గా హోదా పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీగా పని చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన తాను టీచర్‌గా పని చేసిన సోదరుడు వాసుదేవరెడ్డి ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానని తెలిపారు.
శ్రీకాంత్‌రెడ్డి.. సచివాలయ ఆడిట్ ఆఫీసర్
శంకరపట్నం: మెట్‌పల్లికి చెందిన సారబుడ్ల శ్రీకాంత్‌రెడ్డి తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, 2012లో గ్రూప్–2, 2017లో గ్రూప్–1 ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆడిట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తే తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని అన్నారు.
శ్రీధర్.. క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి పట్టణానికి చెందిన నడిమెట్ల శ్రీధర్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆయన 1997 ఐఏఎస్ బ్యాచ్ చెందిన అధికారి. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొదట రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ఐటీడీఏ పీవోగా, కాకినాడ పోర్ట్ డైరెక్టర్‌గా సేవలందించారు. అ తర్వాత అనంతపూర్, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సీఎంవో కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015 జనవరి 1న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత జనవరిలో ఎస్సీ అభివృద్ధి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమించింది.
అనుదీప్.. హైదరాబాద్ కలెక్టర్
మెట్‌పల్లి(కోరుట్ల): నాలుగుసార్లు సివిల్స్ పరీక్షల్లో విఫలమైనా ఐదోసారి 2018లో ఐఏ ఎస్‌గా ఎంపికయ్యారు మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్. ఏకంగా ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు. శిక్షణ అనంతరం భద్రాది కొత్తగూడెం ట్రైనీ కలెక్టర్‌గా, అడిషనల్ కలెక్టర్‌గా పని చేశారు.
2021లో అదే జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డుకు కృషి చేశారు. 2023 జూన్‌లో హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జిల్లా కలెక్టర్‌గా పని చేసినవారిలో అనుదీపే అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం.