Skip to main content

Civil Services : ముగిసిన సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు.. పర్సనాలిటీ టెస్ట్‌పై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024 ద్వారా 1,056 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించింది.
Personality test tips and awareness post mains exams in upsc civils services

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌–2024.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర ఉన్నత సర్వీసులకు ఎంపిక ప్రక్రియలో రెండో దశ! ఇటీవల సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ముగిసాయి. దీంతో మెయిన్స్‌ తర్వాత ఏం చేయాలి.. ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలా.. కటాఫ్‌ ఎంత ఉంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సివిల్స్‌ మెయిన్‌–2024 పరీక్షల విశ్లేషణతోపాటు, తదుపరి దశ పర్సనాలిటీ టెస్ట్‌లో రాణించేందుకు మెలకువలు..

ఇందుకోసం తొలి దశ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి.. 14,627 మందిని మెయిన్స్‌కు చేసింది. వీరిలో 2,300 నుంచి 2,500 మందికే చివరి దశ ఇంటర్వ్యూకు అర్హత లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రంలో 708 మంది, విజయవాడ కేంద్రంలో 136 మంది మెయిన్స్‌ పరీక్షలు రాసినట్లు సమాచారం.
Mumbai International Airport : ఏఐఏఎస్‌ఎల్‌లో ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వివిధ పోస్టులు
మిశ్రమ స్పందన

సివిల్స్‌ మెయిన్స్‌–2024 పరీక్షలపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జనరల్‌ ఎస్సే, జనరల్‌ స్టడీస్‌ నాలుగు పేపర్లు, రెండు ఆప్షనల్‌ పేపర్లు కలిపి మొత్తం ఏడు పేపర్లుగా.. 1,750 మార్కులకు పరీక్ష నిర్వహించారు. వీటిల్లో కొన్ని పేపర్లు క్లిష్టంగా, మరికొన్ని పేపర్లు సులభంగా ఉన్నాయని చెబుతున్నారు. 
800 కటాఫ్‌ అంచనా
మెయిన్స్‌ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో తలెత్తే సందేహం.. ఎన్ని మార్కులు వస్తే తుది దశ ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది? అనేది. సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల శైలిని విశ్లేషిస్తే.. కటాఫ్‌ మార్క్‌ ఓపెన్‌ కేటగిరీలో 800గా ఉండొచ్చనేది నిపుణుల అంచనా. దీంతో.. ఈ స్థాయిలో మార్కులు సాధిస్తామని భావిస్తున్న అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌లో విజయానికి ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలని సూచిస్తున్నారు.
పేపర్‌–1.. జనరల్‌ ఎస్సే
మెయిన్స్‌లో అభ్యర్థులు ఎంతో కీలకంగా భావించే జనరల్‌ ఎస్సే పేపర్‌ ఈ సారి సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. తాత్విక దృక్పథం, విశ్లేషణను పరిశీలించేలా ప్రశ్నలు కనిపించాయి. ఎస్సేలు సామాజిక విలువలకు, సమకాలీన పరిస్థితులకు సంబంధించినవి కావడంతో అభ్యర్థులు కొంత సులభంగా ఉన్నట్లు భావించారని పేర్కొంటున్నారు.
Nuclear Submarine: భారత అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి
పేపర్‌–2(జీఎస్‌–1) క్లిష్టంగానే

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1 క్లిష్టంగానే ఉందంటున్నారు. ఆయా టాపిక్స్‌కు సంబంధించి లోతైన అవగాహన, సంపూర్ణ పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు రాయగలిగేలా ప్రశ్నలు అడిగారు. ప్రపంచ చరిత్ర, జాగ్రఫీ, భారత చరిత్ర అన్నింటికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించిన ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉన్నాయి. జాగ్రఫీకి ఎక్కువ వెయిటేజీ కల్పిస్తూ ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఎకనామిక్‌ జాగ్రఫీ సంబంధిత ప్రశ్నలు ఎదురయ్యాయి. 
పేపర్‌–3 (జీఎస్‌–2).. ఓ మోస్తరు క్లిష్టత
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–2లో పరిపాలన, న్యాయ పరమైన అంశాలు, అంతర్జాతీయ సంబంధాలపై ప్రశ్నలు అడిగారు. సమకాలీన అంశాలతో ముడిపెడుతూ ప్రశ్నలు ఎదురయ్యాయి. మొత్తం 20 ప్రశ్నల్లో.. రాజ్యాంగ సిద్ధాంతాలు, న్యాయపరమైన అంశాలు, పరిపాలన, స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రశ్నలు కనిపించాయి. అదే విధంగా.. కేస్‌ స్టడీ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. ముఖ్యంగా సమకాలీన అంశాలను కోర్‌ సబ్జెక్ట్‌లతో సమ్మిళితం చేస్తూ సమాధానాలు ఇచ్చే విధంగా ప్రశ్నలు కనిపించాయి.
Trainee Supervisor Posts : పీజీసీఐఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు
పేపర్‌–4 (జీఎస్‌– 3).. సిలబస్‌ పరిధిలోనే

జీఎస్‌–3(పేపర్‌–4)లోని ప్రశ్నలన్నీ సిలబస్‌ పరిధిలోనే అడిగారు. దీంతో.. సిలబస్‌ను ఆసాంతం అవగాహన చేసుకున్న అభ్యర్థులు సులభంగానే సమాధానాలను రాసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాపులేషన్, భూ సంస్కరణలు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్‌బీఐ ద్రవ్య విధానం, సామాజిక సేవల్లో ప్రభుత్వ వ్యయం వంటి ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలు సమకాలీన అంశాలతో ముడిపెడుతూ అడగడంతో కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు సులభంగానే పరీక్ష రాసే అవకాశముందని పేర్కొంటున్నారు.
పేపర్‌–5 (జీఎస్‌–4)
నైతికత, చిత్తశుద్ధి, వైఖరి ఆధారితంగా ప్రశ్నలు అడుగుతున్న జీఎస్‌–4 పేపర్‌లో సంఘటనలపై ప్రశ్నలు అడిగారు. ఇందులో మొదటి సెక్షన్‌లో ఇంటిగ్రిటీ, ఎథిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అభ్యర్థుల నిర్ణయ సామర్థ్యాన్ని, అదే విధంగా మోర­ల్‌ జడ్జ్‌మెంట్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారు అనే విషయం తెలుసుకునేలా కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. 
ఆప్షనల్స్‌.. సబ్జెక్ట్‌ + సమకాలీనంగా
సివిల్స్‌ మెయిన్‌లో కీలకంగా భావించే పేపర్లు.. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు. పేపర్‌–6, పేపర్‌–7లుగా అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌ నుంచి రెండు పేపర్లలో పరీక్ష జరిపారు. వీటిల్లో ముఖ్యంగా పాలిటీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీలలో.. అధిక శాతం సబ్జెక్ట్‌ నైపుణ్యం ఆధారిత ప్రశ్నలే కనిపించాయి. దీంతో ఆప్షనల్స్‌పై పట్టు సాధించిన అభ్యర్థులు ఊరట చెందారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పర్సనాలిటీ టెస్ట్‌కు ఇలా
ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌ను 275 మార్కులకు నిర్వహిస్తారు. సన్నద్ధత కోణంలో అభ్యర్థులు ప్రధానంగా వ్యక్తిగత అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి. అకడమిక్‌ నేపథ్యం, ఉద్యో­గం చేస్తున్నట్లయితే ప్రొఫెషనల్‌ నేపథ్యం, కుటుంబ నేపథ్యం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థుల నేపథ్యం, వారి దృక్పథం, వైఖరి తెలుసుకునేలా బోర్డ్‌ సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సివిల్స్‌ను ఎంచుకోవడానికి కారణం మొదలు సమకాలీన అంశాల వరకూ.. అన్ని కోణాలపై అవగాహన పెంచుకోవాలి. 
సమకాలీన అంశాలు
అభ్యర్థులు సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌– గాజా, ఇరాన్, లెబనాన్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాలు, వాటి పర్యవసానాలు, వాటికి సంబంధించి మన దేశ వ్యూహాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోవాలి. జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న పరిణామాలపైనా అవగాహనతో ఉండాలి.
ITI Admissions: ఐటీఐల్లో నాలుగో విడత అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే
ప్రాంతీయ నేపథ్యం

ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమ రాష్ట్రం, జిల్లా, ప్రాంతం ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి. చారిత్రక నేపథ్యంపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అభ్యర్థుల సూచనలపైనా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహనతోపాటు, పరిష్కార మార్గాలతో సన్నద్ధమవ్వాలి. 
ఆసక్తులు.. ఆకట్టుకునేలా
సివిల్స్‌ ఇంటర్వ్యూ అభ్యర్థులు.. తమ హాబీలపై కొంత కసరత్తు చేయాలి. చాలామంది బుక్‌ రీడింగ్, వాచింగ్‌ టీవీ అని, సింగింగ్, ప్లేయింగ్, మూవీస్‌ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వ్యూలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గమనించాలి. దీంతోపాటు అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అభ్యర్థులు తమకున్న బలహీనతల గురించి చెప్పే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్‌’, ‘సహనం తక్కువ’ వంటి సమాధానాలు చెప్పకపోవడమే మంచిది.
సూటిగా, స్పష్టంగా
పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల వ్య­క్తిగత వ్యవహార శైలి కూడా విజయాన్ని నిర్దేశిస్తుంది. ప్రధానంగా తమ అభిప్రాయాలను సూటిగా,స్పష్టం గా చెప్పగలిగే సామర్థ్యం, ధైర్యం అలవర్చుకోవాలి. ఇందుకోసం తమ అభిప్రాయాలను బలపరిచే అంశాలను ఉదహరించేలా సన్నద్ధమవ్వాలి. తమ అభిప్రాయాన్ని ఎదుటి వారిని మెప్పించే విధంగా చెప్పాలి.
సమయస్ఫూర్తి
సివిల్స్‌ అభ్యర్థులు అలవర్చుకోవాల్సిన మరో లక్షణం.. సమయస్ఫూర్తి. ఈ లక్షణాన్ని పరిశీలించేందుకు.. ‘మీరు ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫలానా సమస్య ఎదురైంది? దీనికి తక్ష­ణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూనే, రాజ్యాంగానికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
తక్కువ మార్కులే అనుకోవద్దు
మొత్తం 2025 మార్కులకు నిర్వహించే మూడంచెల సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూకు కేటాయించింది 275 మార్కులే. కాని తుది జాబితాలో నిలిచేందుకు ఇవే కీలకంగా మారుతున్నాయి. ఆయా అంశాలపై అవగాహనను, వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించే విధంగా ఇంటర్వ్యూ ఉంటోంది. దీంతో ఏ మాత్రం తడబాటుకు గురైనా.. కొద్ది మార్కుల తేడాతో విజయం చేజారే ఆస్కారముంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే సమాకాలీన పరిణామాలు, వ్యక్తిత్వ లక్షణాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Published date : 23 Oct 2024 12:19PM

Photo Stories