Skip to main content

Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరి.. ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొని...నేడు ఈ స్థాయికి వ‌చ్చింది.
Rohini Sindhuri , IAS
రోహిణీ సింధూరి, కలెక్టర్‌

రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది.

తన బిడ్డకు అండగా నిలబడింది. చివరకు ఆమె కృషి ఫలించింది. కన్నబిడ్డను కలెక్టర్‌ను చేసింది..ఆ కలెక్టర్‌కు అమ్మగా ఎనలేని సంతోషాన్ని మూటగట్టుకుంది కర్నాటక ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసిన సింధూరి కలను నిజం చేసిన శ్రీలక్ష్మీరెడ్డి. ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, సవాళ్ల గురించి 'సాక్షి'తో పంచుకున్నారు. ఆ విషయాలు ఈమె మాటల్లోనే...

కుటుంబ నేప‌థ్యం :

rohini sindhuri ias family


మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. మావారు దాసరి జయపాల్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మాది చాలా పెద్ద కుటుంబం. మా పెద్దమ్మాయి రోహిణీ సింధూరిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం. కానీ సింధూరి ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఉంటానని ఖరాకండిగా చెప్పేసింది. చేసేదేం లేక ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో కూడా మళ్లీ అమెరికా గురించి అడిగితే చిరాకుపడింది. ఇక వదిలేశాం.

ఈ కోరిక‌తోనే..
నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. 1990 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాను. నా సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్‌స్పైర్‌ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్‌ బెస్ట్‌ మార్గం అనుకుంది. ''అమ్మా నేను కలెక్టర్‌ అవుతా'' అన్నది. ''కలెక్టర్‌ అయితే ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవ చేయోచ్చు. కాబట్టి నన్ను సివిల్స్‌లో చేర్పించండంటూ'' కోరింది. ఆమె కోరిక మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌లో చేర్పించాం.

యాక్సిడెంట్‌ అయి...

rohini sindhuri


మెయిన్స్‌ కోసం సింధూ ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో పొద్దున్నే తను పాలప్యాకెట్‌ కోసం కిరాణా స్టోర్‌కి వెళ్లింది. పాలు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొంది. ఆ సమయంలో సింధూ తీవ్ర గాయలపాలయ్యింది. మాకు చెబితే మేం కంగారు పడ్తాం అని తన స్నేహితురాలికి ఫోన్‌ ద్వారా చెప్పింది. ఆమె నాకు ఫోన్‌ చేసి చెప్పడంతో నేను ఢిల్లీ పయనమై వెళ్లి అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. బెడ్‌ మీద పడుకునే చార్ట్‌లపై క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ని రాసుకోవడం, వీల్‌ఛైర్‌లో కూర్చుని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాయడం చేసింది. ఆఖరికి బాత్‌రూమ్‌లోని గోడలపై కూడా తను రాతలు రాసి ప్రిపేర్‌ అయింది. ఆ రోజులు గుర్తొస్తే...కన్నీరు ఆగదు నాకు.

ఎందరో పోకిరీలు ఎన్నో సందర్భాల్లో..

Education


సింధూకి దేవుడు అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం కోసం ఎందరో పోకిరీలు ఎన్నో సందర్భాల్లో సింధూని వేధించారు. తను కాలేజీకి వెళ్తున్న సమయంలో చాలా మంది వెంటపడి ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ''అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను. ప్రతి ఒక్కడు నాతో మాట్లాడు, లేదంటే బాగోదు అంటూ బెదిరిస్తున్నారు'' అని చెప్పి ఏడ్చేది. చేసేదేమీ లేక మూడు కాలేజీలు మార్చాం. ఎన్ని కాలేజీలు మార్చినా సింధూపై వేధింపులు మాత్రం ఆగలేదు. ఆ సమయంలో తల్లిగా నేను తనలో ధైర్యాన్ని నింపాను. సమాజంలో ఎలా ఉండాలి, అబ్బాయిల నుంచి వేధింపులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఓ స్నేహితురాలిగా వివరించా. అప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదురించి నిలబడింది.

వచ్చేదా..చచ్చేదా అన్నారు...కానీ

IAS Family


బంధువుల నుంచి సింధూకి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. తనకు నచ్చకపోవడం వల్ల మేం తిరస్కరించాం. ఆ సమయంలో ‘ఏంటి మీరు లక్షలు పోసి చదివిస్తున్నారు? అసలు ఆమెకు ఐఏఎస్‌ వచ్చేదా..చచ్చేదా..? ఏం..మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఏమౌవతదంట? అంటూ ఎంతో మంది సూటిపోటి ప్రశ్నలతో నన్ను వేధించారు. కానీ నేను ఏనాడూ సింధూ వద్ద ప్రస్తావించలేదు. తను కలెక్టర్‌ అయ్యాక కానీ వారంతా నోరుమసూకున్నారు. నా బిడ్డ నన్ను తల ఎత్తుకునేలా చేసిందని గర్వపడుతున్నాను. అసలు మా వంశంలో కలెక్టర్‌ అయినవారు ఏవరూ లేరు.

ఆమె కోసం జనం రోడ్లెక్కారు అంటే..

rohini sindhuri ias transfer


రోహిణీ సింధూరి కర్ణాటక కేడ‌ర్‌లో పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల నుంచి ఆమెకు పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించారు. ట్రాన్స్‌ఫర్‌ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజానీకం ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ ఇచ్చి వెనక్కి తీసుకుంది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా ఇబ్బందులు వస్తాయో..ప్రభుత్వమే స్వయంగా గుర్తించింది.

ఈ సంద‌ర్భంలో..
కలెక్టర్‌ అంటే సమాజంలో గొప్ప హోదా. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందుబాటులోకి వస్తాయి. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కలెక్టర్‌ రోహిణి సింధూరి. తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్‌ చేశారు. మార్గంమధ్యలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది.

IAS Car

ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీసి, మరో టైర్‌ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు కలెక్టర్‌ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వైరల్‌ అయ్యాయి. కలెక్టర్‌ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్‌ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు.

పెద్ద ఎత్తున భూముల అక్రమాలను..
మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్‌ ప్రకాశ్‌కు లేఖ రాశారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమైంది.

మంత్రికే చెమ‌ట‌లు ప‌ట్టిందిలా..

IAS Interview


అప్ప‌టి హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించింది. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఏ.మంజు.. ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ రోహిణి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్‌ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని మంత్రి తన లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్‌ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేర‌కుఈసీ సింధూరికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 06 Jan 2022 07:16PM

Photo Stories