Skip to main content

IAS Srushti Jayanth Deshmukh Success Story : ఈ ఐఏఎస్ జీవితం అందమైనది.. బంగారం లాంటి కలలు.. కానీ..!

ఎవ‌రైన ఉన్న‌త‌స్థాయికి రావాల‌ని.. ఎంతో ఆరాట‌ప‌డుతుంటారు. కానీ ఈ పోరాటంలో కొంద‌రికి మాత్ర‌మే ఈ అవ‌కాశం వ‌స్తుంది.
IAS Srushti Deshmukh Success Story

విజ‌యం సాధించిన వారు ప్రశంసలు పొందడం మాత్రమే కాదు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తారు.  అలాంటి వారిలో సృష్టి దేశ్‌ముఖ్ ఒకరు. యూనియ‌స్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ పరీక్షలో మొద‌టి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్‌ సాధించి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో సృష్టి దేశ్‌ముఖ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం : 
సృష్టి దేశ్‌ముఖ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సృష్టి దేశ్‌ముఖ్ గౌడ 1995లో  పుట్టింది. ఈమె తండ్రి జయంత్ దేశ్‌ముఖ్. ఇత‌ను ఇంజనీర్. ఆమె తల్లి సునీతా దేశ్‌ముఖ్. ఈమె టీచర్. 

ఎడ్యుకేష‌న్ : 

Srushti Deshmukh IAS

చిన్ననాటి నుంచి తెలివైన సృష్టి విద్యార్థి. భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్‌లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో 12వ బోర్డు పరీక్షలో 93.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశపడింది. కానీ సీటురాలేదు. చివరికి భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్‌ పూర్తి  చేసింది. తరువాత తన డ్రీమ్‌ను పూర్తి చేసుకోవడం కోసం సివిల్స్‌ పరీక్ష రాసి.. విజయం సాధించింది.

☛➤ Sachin Atulkar IPS Success Story : 23 ఏళ్ల‌కే ఐపీఎస్‌.. 1.1 మిలియన్ ఫాలోవర్లు.. కానీ..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో విజయం అంటే మామూలు సంగతి కాదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. అయితే కొన్ని వందల మంది మాత్రమే  సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS అధికారిగా మారతారు. కానీ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించింది అంతే కాదు UPSC Civils-2018 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో టాపర్ కూడా. అప్పటికి ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు.

వివాహాం :

Srushti Jayant Deshmukh Wedding

సృష్టి అదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున్ బి. గౌడను వివాహం చేసుకున్నారు. ఐఏఎస్  అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగా ఉంటూ.. సోషల్‌ మీడియాలో విశేషంగా నిలుస్తున్నారు. సృష్టి దేశ్‌ముఖ్ రోజూ యోగా కూడా చేస్తుంది. సృష్టికి సంగీతం అన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం.

ఆమె పనితీరుకు నెటిజనులు ఫిదా అయిపోతుంటారు. సమస్యలపై తాను వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజలతో సన్నిహితంగా ఉంటూనే పనిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా ఉంటారు. దీంతో ప్రజల్లో కూడా ఆమెకు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా మంచి పేరు వచ్చింది. 

ఈ ఫెయిల్యూర్‌తో.. కల కలగానే మిగిలిపోయింది.. కానీ

Srushti Jayant Deshmukh IAS Officer Success Story

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) రాసింది. అయితే దానిలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చదవాలనే ఆమె కల కలగానే మిగిలిపోయింది. అయితే అక్కడితో ఆగిపోకుండా, అధైర్యపడకుండా, ఆమె భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. అక్కడ ఆమె కెమికల్ ఇంజినీరింగ్‌ను అభ్యసించారు. కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయిన తర్వాత యూపీఎస్‌సీ పరీక్షలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సృష్టి నిర్ణయించుకున్నారు. జేఈఈ ఉత్తీర్ణత సాధించలేకపోయిన నిరాశ చెందిన సృష్టిని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 

ఎదురుదెబ్బలను తట్టుకుని విజయాన్ని తన పరం చేసుకున్నారు. ప్రస్తుతం ఎంతో మంది ఔత్సాహిక యువతకు ఐఏఎస్ సృష్టి దేశ్ ముఖ్ ఒక మార్గదర్శిగా ఉన్నారు.

Published date : 30 Jan 2025 08:24AM

Photo Stories