IAS Success Story : విదేశాల్లో లక్షల్లో జీతం.. లగ్జరీ లైఫ్.. భారత్‌కు వచ్చి కలెక్టర్ అయ్యానిలా.. కానీ..!
![IAS Officer Divya Mittal Success Story IAS Divya Mittal Success Story](/sites/default/files/images/2025/01/30/iasdivyamittalsuccessstory-home-1738210087.jpg)
అందులోనూ పెళ్లైన అమ్మాయికైతే ఏంటీ ఆలోచన అని తిట్టిపోస్తారు. కానీ ఈ అమ్మాయి వాటన్నింటిని పక్కన పెట్టి మరీ భర్త అండదండలతో సివిల్స్ ప్రిపేరయ్యింది. మరీ ఐఏఎస్ సాధించింది. ఈమే హర్యానాకు చెందిన దివ్య మిట్టల్ ఐఏఎస్. ఈ నేపథ్యంలో దివ్య మిట్టల్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం...
సాహసోపేతమైన నిర్ణయమే... కానీ
ఐఏఎస్ అవ్వాలనేది చాలామంది యువత ప్రగాఢమైన కోరిక. కొందరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అసామాన్య ప్రతిభతో ఐఏఎస్ అవ్వుతారు. ఆ క్రమంలో తొలి, రెండు ప్రయత్నాల్లో తడబడి.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించినవారు ఉన్నారు. అలా ఇలా కాకుండా విదేశాల్లో లక్షల్లో జీతం సంపాదిస్తూ సెటిల్ అయ్యి.. కూడా ఐఏస్ అవ్వాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయమే.
పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అక్కడే..
![ias success story in telugu](/sites/default/files/inline-images/ias%20family_0.jpg)
హర్యానాకు దివ్య మిట్టల్ లండన్ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లోని జేపీ మోర్గాన్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసింది. హయిగా లక్షల్లో జీతం తీసుకుంటూ ధర్జాగా గడుపుతుండేది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. ఎందుకనో ఆ లైఫ్ ఆమె కస్సలు నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి దీంతో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్‌కి ఎందుకు ప్రిపేరవ్వకూడదు అనుకుంది. కఠినతరమైన ఈ పరీక్షను ఇలాంటి పరిస్థితిలో సాధించి గెలిస్తే ఆ కిక్కే వేరు అనుకుంది. అనుకున్నదే తడువుగా భర్తతో కలిసి స్వదేశానికి వచ్చేసి మరీ 2012లో యూపీఎస్సీ(UPSC)కి ప్రిపేరయ్యింది.
☛➤ Sachin Atulkar IPS Success Story : 23 ఏళ్లకే ఐపీఎస్.. 1.1 మిలియన్ ఫాలోవర్లు.. కానీ..!
ఐపీఎస్.. ఐఏఎస్ ఇలా..
తొలి ప్రయత్నంలో అనుకున్నది సాధించలేకపోయింది. ఐపీఎస్‌తో సరిపెట్టకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో 2013లో మళ్ళీ పరీక్ష రాసి 68 వ ర్యాంకు సాధించి ఐఏఎస్(IAS) కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మిర్జాపూర్, సంత్ కబీర్ నగర్ బస్తీ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తోంది. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్‌కి సిద్ధమయ్యే అభ్యర్థులు ఎల్లప్పడూ తమ లక్ష్యంపై దృష్టి సారించాలి. చక్కటి ప్రణాళితో ఎలా చదవుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకోసారి విరామం తీసుకుంటే... రిఫ్రెష్‌గా మరింత బాగా చదవగలుగుతారని సలహాలిస్తోంది.
ఫోన్‌కి దూరంగా ఉంటే...
![ias success story in telugu](/sites/default/files/inline-images/divyamittal%20IAS.jpg)
ఇలాంటి కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఏ అభ్యర్థి అయిన ఫోన్‌కి దూరంగా ఉంటే అన్నుకున్నది సాధించగలుగుతారని అంటోంది దివ్య. అనుకున్నది సాధించాలనుకునేవారు ముందు చూపుతో సాగిపోవాలే గానీ తప్పుచేస్తన్నానా.. అనే అనుమానంతో ఊగిసలాడితే ఘన విజయాలను అందుకోలేరు, రికార్డులు సృష్టించలేరు అని ధీమాగా చెబుతోంది దివ్య.
ఈమె చెప్పిన పాఠాలు వింటే...?
మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను.
పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి అంటూ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రాసిన ట్విట్టర్ పోస్టు వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటంటే..?
మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐఐటికి వెళ్లాం. నేను ఐఐఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐఏఎస్ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను.
దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా..
నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి అని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ రాసిన ట్విటర్ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా గుర్తింపు పొందింది.
దివ్యను మెచ్చుకుంటూ..
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న దివ్య మిట్టల్ అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే. ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలా మందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్‌ను వైరల్ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి.
మీరు ఏదైనా చేయగలరు అని..
పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు.
పడనివ్వండి పర్వాలేదు.. కానీ..:
పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి.
ఓడినా పర్వాలేదు.. కానీ :
వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు.. పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి.
రిస్క్‌లో కూడా..
పిల్లలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది.
మా చిన్నప్పుడు.. :
![upsc ranker success stories in telugu](/sites/default/files/inline-images/ias%20story_2.jpg)
మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం.. అంత పేదగా ఉన్నాం.. కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి.. ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది.. ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి.. బోలెడంత సంపద ఉంది.. నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది.. ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి.
పిల్లలకు తల్లిదండ్రులను మించిన.. :
పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్‌మోడల్స్ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
వీరి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండిలా..
పూర్వీకులు, ముందు తరం వారితో పిల్లల్ని పోల్చితే వారి మనసు నొచ్చుకుంటుంది. నిజానికి ఏ తరానికి ఉండే అవకాశాలు, సౌలభ్యాలు, వనరులు ఆ తరానికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మా తరం, మా ముందు తరం వారంతా టీచర్ వృత్తిలో ఉన్నాం.. మీరూ ఈ రంగంలోకే రావాలం టూ వారిపై ఒత్తిడి తేకుండా.. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
మందలించండి.. కానీ :
పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి.
ఇలా పొరపాటున కూడా అనకండి.. ఎందుకంటే..?
మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. నీ మీద నమ్మకం పోయింది అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి.
వీలైన చోటుకు తీసుకెళ్లి..
మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్ ల్యాబ్‌లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి.
వెంటనే రియాక్ట్ కావద్దు..
పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు.
వీళ్లతో పోల్చకండి.. ఎందుకంటే..?
మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు.
Tags
- Divya Mittal IAS
- divya mittal ias success story
- divya mittal ias biography
- IAS Divya Mittal Success Story
- IAS Divya Mittal is a 2013 batch officer
- IAS Divya Mittal Story
- IAS Divya Mittal Real Life Story
- divya mittal ias real life story in telugu
- Left London job to become IAS officer Divya Mitta
- Left London job to become IAS officer Divya Mitta Story
- Left London job to become IAS officer Divya Mitta Success Story
- IAS Divya Mittal Success Story in Telugu
- Ias Officer Success Story
- IAS
- IAS Officer
- woman ias
- woman ias officer success story
- woman ias officer success success story
- woman ias officer success success story in telugu