Sachin Atulkar IPS Success Story : 23 ఏళ్లకే ఐపీఎస్.. 1.1 మిలియన్ ఫాలోవర్లు.. కానీ..!

సినిమా ప్రముఖులను అధిగమించే ఫిట్‌నెస్. అతను చిన్న వయసులోనే ఏసీపీ(ACP) పదవికి పదోన్నతి పొందాడు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ సచిన్ అతుల్కర్ సక్సెస్ జర్నీ మీకోసం...
ఐపీఎస్ సచిన్ అతుల్కర్ 1984 ఆగస్టు 8న జన్మించారు. ఐపీఎస్ సచిన్ అతుల్కర్ బికామ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత... UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిపేరయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే.. 2006లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 258వ ర్యాంకు సాధించారు. అతి పిన్న వయస్కుడైన ఐపీఎస్ అధికారిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన అతిపిన్న వయస్సులోనే డిఐజి అయ్యాడు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ACPగా పనిచేస్తున్నారు.
ఆయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఫీల్డ్ డ్యూటీలోనే గడిపారు. ఐపీఎస్ సచిన్ అతుల్కర్ ప్రతిరోజూ దాదాపు 2 గంటలు జిమ్‌లో వ్యాయామం చేస్తారు.
1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు..

ఐపీఎస్ సచిన్ అతుల్కర్.. సోషల్ మీడియాలో బాగా పాపులర్. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. చాలా వరకు సివిల్ సర్వెంట్లు సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవ్వరు. కానీ ఇటీవలి కాలంలో ఐఏఎస్ అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌లుగా మారిపోతున్నారు. ప్రస్తుతం సచిన్ అతుల్కర్‌కు కూడా 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని పేరు మీద చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. సచిన్ అతుల్కర్ ఐపీఎస్‌కు కూడా రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ వారు దానిని తిరస్కరించారు.
మొదటి ప్రయత్నంలోనే...

23 ఏళ్ల వయస్సులో చాలామందికి తాము జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో.. ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టత ఉండదు. సచిన్ అతుల్కర్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఎందుకో ఆ క్షణంలో సివిల్స్ రాయాలనిపించింది. దాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోలేదు. పట్టుదల, కసిగా చదివాడు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాడు.
ఇష్టమైన ఇవే...!

సచిన్ అతుల్కర్.. హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. క్రీడలు సచిన్ అతుల్కర్ కు చాలా ఇష్టమైన అంశం. ముఖ్యంగా క్రికెట్‌లో అతను చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు. 1999లో జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. దానికి తోడు గుర్రపు స్వారీలో కూడా బంగారు పతకం సాధించాడు.
Tags
- IPS Success Story
- IPS Success Story in Telugu
- IPS officer Sachin Atulkar
- IPS officer Sachin Atulkar Success Story
- IPS officer Sachin Atulkar Success Story in Telugu
- ACP Success Story in Telugu
- ACP Success Story Telugu
- IPS officer Sachin Atulkar Real Life Story
- IPS officer Sachin Atulkar Inspire Story
- IPS officer Sachin Atulkar Motivational Story
- Deputy Inspector General
- Deputy Inspector General Story in Telugu
- Deputy Inspector General Success S
- IPS officer Sachin Atulkar UPSC Rank
- IPS officer Sachin Atulkar UPSC Civils Rank
- sakshieducation success stories