DIGs In CBI: సీబీఐ డీఐజీలుగా నియమితులైన ఆర్.ప్రకాష్, విద్యుత్ వికాశ్
Sakshi Education
సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆర్.ప్రకాశ్, విద్యుత్ వికాస్‌లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డీఐజీలుగా నియమితులయ్యారు.
![Senior IPS officers R Prakash, Vidyut Vikash appointed DIGs in CBI](/sites/default/files/images/2025/01/31/prakash-vidyut-vikash-1738297760.jpg)
2008 ఒడిశా బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి ప్రకాష్‌ను ఐదేళ్లపాటు డీఐజీగా నియమించినట్లు నియమిస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జనవరి 29వ తేదీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం సీబీఐలో ఎస్పీగా ఉన్న వికాశ్ 2025 ఫిబ్రవరి 18 వరకు డీఐజీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
అలాగే.. కేంద్ర దర్యాప్తు సంస్థతో పనిచేస్తున్న మరో ఇద్దరు డీఐజీలు నీతూ కమల్, అభినవ్ ఖరేల పదవీ కాలాన్నీ మరో రెండేళ్లపాటు పొడిగించారు.
2008 ఛత్తీస్‌గఢ్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కమల్ పదవీ మార్చి 25, 2027 వరకు ఉంటుంది. 2009 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఖరే పదవీ కాలం మార్చి 22, 2027 వరకు పొడిగించారు.
Dhananjay Shukla: ఐసీఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ధనుంజయ్ శుక్లా.. ఉపాధ్యక్షుడిగా..
Published date : 31 Jan 2025 09:59AM