Skip to main content

High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా

తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Centre Notifies Appointment Of Three Permanent Judges for High Court of Telangana

సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.

జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్‌ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
 
ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితుల‌య్యారు. కాగా, శాశ్వత న్యాయ మూర్తులుగా జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్‌ కె.సుజన ఫిబ్ర‌వ‌రి 14న‌ బాధ్యతలు చేపట్టారు.

TG High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు వీరే..

Published date : 15 Feb 2025 08:50AM

Photo Stories