Skip to main content

TG High Court Judges: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు..

తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత జడ్జీలుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Supreme Court Collegium Recommends Permanent Status for Three Telangana High Court Judges

హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్లను శాశ్వత జడ్జీలుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవన్న నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ కేంద్ర న్యాయశాఖకు ఈ మేరకు సిఫార్పులు పంపింది.

2023 జూలై 31న వారు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో వందల సంఖ్యలో పిటిషన్లను పరిష్కరించారు. సుప్రీంకోర్టు కొలీ జియం సిఫార్సులకు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీంతో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరింది. అదనపు న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు తగ్గింది. రెండు కలిపి ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జస్టిస్ సుజన కళాసికం..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మధుసూద న్, ప్రమీల దంపతులకు 1970 మార్చి 10న సుజన జన్మించారు. ఇంటర్ అలేరులో, డిగ్రీ ఓయూలో పూర్తి చేశారు. 1997లో బార్ కౌన్సిల్లో 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ హోదాలో కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాశారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, హైకోర్టు రిజి స్టార్ జనరల్ గా పనిచేశారు. ఘట్కేసర్ కు చెందిన న్యాయవాది శ్రీశంకర్ న్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.

High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా న‌లుగురు జడ్జీలు

జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు గంగాధర్, రాజు బాయి దంపతులకు 1968 మే 13న జన్మించారు. ముప్క‌ల్ జెడ్సీహెచ్ఎస్లో ఎస్ఎస్సీ పూర్తి చేశారు. నిజా మాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదివారు.
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్ మెంబర్ య్యారు. రాజ్యాంగం, సివిల్ లాలో పట్టు సాధించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్టీసీసీ, వివిధ బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సి ల్గా పనిచేశారు. కవిత వాహినిని వివాహం చేసుకున్నారు. వారికి కుశాల్ కృష్ణ, లాస్య సంతానం.

జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి..
లక్ష్మీబాయి, వీర బసప్పలకు 1971 డిసెంబర్ 28న జన్మిం చారు. వారిది సంగారెడ్డి జిల్లా మంగపేట్. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరిం గ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, లాలో బ్యాచిలర్ డిగ్రీ, మర్కంటైల్ లాలో మాస్టర్స్ డిగ్రీ. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో పీజీ డిప్లొమా చేశాడు. 2002 నవంబర్ 14న న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు.
హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2014 మార్చి నుంచి 2023 జూలై వరకు హైకోర్టులో రాష్ట న్యాయ సేవా ఆధారిటీ, జిల్లా న్యాయ సేవా అథారిటీ, శాశ్వత లోక్ అదాలత్లకు స్టాండింగ్ కౌన్సెల్‌గా ప్రాతినిధ్యం వహించారు. హిమబిం దును వివాహం చేసుకున్నారు. వారికి అక్షిత, హర్ష వల్లిక, లక్ష్మీవీర వెంకటేశ్ సంతానం.

AP High Court: హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు

Published date : 07 Feb 2025 08:58AM

Photo Stories