Skip to main content

TG EAPCET 2025 : టీజీ ఈఏపీసెట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌తేదీలు ఇవే..

టీజీ ఈఏపీసెట్‌ 2025కు సంబంధించి నోటిఫికేష‌న్ విడులైంది.
Telangana eapcet 2025 exam notification released  TG EAPSET 2025 notification announcement

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తాంగా ఉన్న ఇంజినీరింగ్ క‌ళాశాలల్లో నూత‌న విద్యాసంవ‌త్స‌రం 2025-26కు సంబంధించి బీటెక్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే విద్యార్థులు రాయాల్సిన ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌.. టీజీ ఈఏపీసెట్‌ 2025. ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడు.. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన విడుద‌ల చేస్తున్నారు అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్ర‌క‌టించింది. ఈసారి కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇక‌, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని.. కర్నూల్‌, విజయవాడ జిల్లాల్లో ఈ పరీక్షకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

Admissions: అడ్మిషన్లకు ముందే స్కూళ్లు,కాలేజీల సీట్ల అమ్మకాలు.. టార్గెట్‌ రూ.1,000 కోట్లు!

ముఖ్య‌తేదీలు..

ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన‌ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ వివ‌రాల అనుసారంగా ఈనెల‌ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులను స్వీక‌రిస్తారు. ఇక‌, దీనికి చివ‌రి తేదీగా ఏప్రిల్ 4వ తేదీ వరకు గ‌డువును ప్ర‌క‌టించారు.
ఇప్పటికే, టీజీ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ను టీజీసీహెచ్‌ఈ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం, ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఈ ప‌రీక్ష‌లు ఉంటాయి. అంటే, మొద‌ట‌ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వ‌హించ‌గా.. మే 2, 3, 4, 5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం తేదీ: ఫిబ్ర‌వ‌రి 25, 2025

ద‌రఖాస్తుల చివ‌రి తేదీ: ఏప్రిల్ 4, 2025

AP Intermediate Board Exams: మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. హాల్‌టికెట్స్‌ విడుదల

మొద‌టి ఆల‌స్య రుసుముతో చివ‌రి తేదీ: రూ. 250ల‌తో ఏప్రిల్ 9, 2025

రెండో ఆల‌స్య రుసుముతో చివ‌రి తేదీ: రూ. 500ల‌తో ఏప్రిల్ 14, 2025

మూడో ఆల‌స్య రుసుముతో చివ‌రి తేదీ: రూ. 2,500ల‌తో ఏప్రిల్ 18, 2025

AP Inter Board Exams Hall Tickets Download 2025 : ఏపీ ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌ల హాల్‌టికెట్లు విడుద‌ల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణ విద్యార్థుల‌కే..

రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన గడువు 10 సంవ‌త్స‌రాలు గతేడాదితో ముగిసాయి.

Board Exams Twice : ఇక‌పై రెండుసార్లు బోర్డు ప‌రీక్ష‌లు.. విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఎప్ప‌టినుంచి!!

ఇక‌, దీంతో, నాన్‌లోకల్‌ కోటా గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పటివరకు అమలులో ఉన్న 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాను రద్దు కానుంది. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణకు చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లను 70 శాతం కన్వీనర్‌ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Feb 2025 03:29PM
PDF

Photo Stories