Dhananjay Shukla: ఐసీఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ధనుంజయ్ శుక్లా
Sakshi Education
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) తన కొత్త కార్యనిర్వాహక సభ్యులను జనవరి 19వ తేదీ ఎన్నుకుంది.

ఇందులో ధనంజయ్ శుక్లాను అధ్యక్షుడి(President)గా, పవన్ జీ చందక్‌ను ఉపాధ్యక్షుడి(Vice President)గా ఉన్నారు.
ధనంజయ్ శుక్లా.. ఐసీఎస్‌ఐలో వివిధ కీలక పాత్రలను నిర్వహించారు. ఆయనకు కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీస్ చట్టం, పన్నుల విధానంలో ప్రత్యేక అనుభవం ఉంది.
2024 సంవత్సరానికి ఐసీఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 2011-14, 2015-18 కాలంలో ఉత్తర భారత ప్రాంత కమిటీ (NIRC) సభ్యుడిగా పనిచేశారు. 2017లో ఉత్తర భారత ప్రాంత చైర్మన్‌గా ఆయన విశేష సేవలందించారు. ఆయన 2019-2020 సంవత్సరాలలో ఐసీఎస్‌ఐ సెక్రటేరియల్ స్టాండర్డ్స్ బోర్డ్‌లో (SSB) సభ్యుడిగా కూడా పనిచేశారు.
ఐసీఎస్‌ఐలో ప్రస్తుతం 75,000 మందికి పైగా సభ్యులు, సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
Vinod Chandran: సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ చంద్రన్ ప్రమాణం
Published date : 20 Jan 2025 05:29PM