BWF Rankings: బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో సింధు
Sakshi Education
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో నిలిచింది.

సింధు ఈ జాబితాలో రెండు స్థానాలు కోల్పోయింది. ఆమె గాయం కారణంగా ఇటీవల ఆసియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగడంతో ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. మాల్విక బాన్సోద్ మూడు స్థానాలు మెరుగై 28వ ర్యాంకులో నిలిచింది.
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌లో.. లక్ష్యసేన్ ఉత్తమంగా 10వ స్థానంలో, ప్రణయ్ 31వ ర్యాంకులో నిలిచారు.
పురుషుల డబుల్స్‌లో.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 7వ స్థానంలో నిలబెట్టుకుంది. ఈ సీజన్‌లో ఈ జంట మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ లలో సెమీస్ చేరింది.
మహిళల డబుల్స్‌లో.. పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ ఒక స్థానం మెరుగై 9వ ర్యాంకులో నిలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో.. ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట 30వ ర్యాంకులో నిలిచింది.
IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్.. 65 రోజుల్లో 74 మ్యాచులు.. ఈ మ్యాచ్‌లు ఎప్పుడంటే..?
Published date : 20 Feb 2025 09:09AM