Skip to main content

UPSC Applications Last Date : గుడ్ న్యూస్‌.. యూపీఎస్సీ ద‌రఖాస్తుల తేదీ పొడ‌గింపు.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే..!!

ఐపీఎస్‌, ఐఏఎస్‌లో అర్హ‌త పొందేందుకు యూపీఎస్సీ ప‌రీక్ష‌ను రాయాల్సి ఉంటుంది.
UPSC civil services preliminary exam applications last date extended  UPSC Civil Services exam notification announcement  UPSC Civil Services Preliminary Examination details

సాక్షి ఎడ్యుకేష‌న్: ఐపీఎస్‌, ఐఏఎస్‌లో అర్హ‌త పొందేందుకు యూపీఎస్సీ ప‌రీక్ష‌ను రాయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌కు వేలా, ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతారు. అయితే, ఇప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న యూపీఎస్సీ.. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ నోటిఫీకేష‌న్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే చాలామంది ద‌ర‌ఖాస్తులు కూడా పూర్తి చేసుకున్నారు. నిజానికి, ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ కూడా పూర్తి రేప‌టితో పూర్తి కానుంది..

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆధార్‌ లింకు ఉంటేనే ఈపీఎఫ్‌ ప్రోత్సాహకాలు

అంటే, ఫిబ్ర‌వ‌రి 11న చివ‌రి తేదీగా నోటిఫికేష‌న్‌లో ప్ర‌క‌టించారు. కాని, ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న‌లో ఈ ప‌రీక్ష‌కు అప్లై చేసుకునేవారికి యూపీఎస్సీ శుభ‌వార్త చెప్పింది. రేప‌టితో కాకుండా, మ‌రి కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తూ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీని పొడ‌గించింది. దీంతో, ఆస‌క్తి చూపిన   మ‌రికొంద‌రు కూడా అప్లై చేసుకునే వీలు ద‌క్కిందని వ్య‌క్తం చేస్తున్నారు.

క‌రెక్ష‌న్స్ కోసం..

యూపీఎస్సీకి సిద్ధ‌మ‌వుతున్నవారికి సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు ద‌ర‌ఖాస్తులు జ‌రుగుతున్నాయి. అయితే, అభ్య‌ర్థులు ఫిబ్ర‌వ‌రి 11వ తేదీలో పూర్తి చేసుకోవ‌చ్చ‌న యూపీఎస్సీ, ఇప్పుడు ఆ గ‌డువుని పెంచుతూ.. ఫిబ్ర‌వ‌రి 18కి చివ‌రి తేదీ అని ప్ర‌క‌టించింది. అంతేకాదు, అభ్య‌ర్థులు వారి ద‌ర‌ఖాస్తుల్లో చేయాల‌నుకున్న మార్పుల‌కు కావాల్సిన క‌రెక్ష‌న్ విండోకు ఫిబ్ర‌వ‌రి 19 నుంచి 25వ తేదీగా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసి అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త చెప్పింది యూపీఎస్సీ.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Feb 2025 11:29AM

Photo Stories