Skip to main content

Ragging Deaths: విద్యా సంస్థల్లో.. ర్యాగింగ్‌ భూతానికి 51 మంది విద్యార్థులు బలి..!

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ కారణంగా 2022-24 మధ్య కాలంలో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
 51 Ragging Deaths In India In Last Three Years

ఈ సంఖ్య కోటాలోని పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలలో జరిగిన ఆత్మహత్యల సంఖ్యతో దాదాపు సమానంగా ఉంది. సొసైటీ ఎగెనెస్ట్‌ వయలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్ ప్రచురించిన ‘భారత దేశంలో ర్యాగింగ్‌ పరిస్థితి 2022-24’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.  

వైద్య కళాశాలలు ర్యాగింగ్ ఘటనలపై విషేషంగా ఎక్కువ ఫిర్యాదులు పొందుతున్నాయని నివేదిక పేర్కొంది. జాతీయ యాంటీ ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌కి 1,946 కళాశాలల నుంచి 3,156 ఫిర్యాదులు అందాయి. వీటిలో 38.6% వైద్య కళాశాలల నుంచి వచ్చాయి. ఈ ఫిర్యాదులు హెల్ప్‌లైన్‌ ద్వారా మాత్రమే నమోదు అయినవేనని, కళాశాలలు లేదా పోలీసులు నేరుగా చేసిన ఫిర్యాదులు ఇంకా ఎక్కువ ఉంటాయని నివేదిక రచయితలు తెలిపారు.

QS Rankings: ప్రపంచవ్యాప్తంగా.. టాప్ 50 విద్యాసంస్థల్లో 9 భారతదేశానివే.. ఆ విద్యాలయాలు ఇవే..

2022-24 మధ్యకాలంలో రాజస్థాన్ కోటాలో 57 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో, యాంటీ ర్యాగింగ్‌ స్కాడ్స్ ను కళాశాలలు ఏర్పాటు చేయాలని, కొత్త విద్యార్థులకు ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో పరిచయం చేయాలని నివేదిక సూచించింది.

‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం.. 2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి 3,156 ఫిర్యాదులు అందినట్లు వెల్లడైంది. ఈ మొత్తం కేసుల్లో, 45.1% కేసులు వైద్య కళాశాలల నుంచి వచ్చినట్లు నివేదిక తెలిపింది. కొంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు అని నివేదిక స్పష్టం చేసింది.

MPs Salary Hike: ఎంపీలకు జీతం, పెన్షన్‌ను పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..

Published date : 25 Mar 2025 12:33PM

Photo Stories