Skip to main content

UPSC : మ‌రోసారి తేదీ పొడ‌గింపు.. యూపీఎస్సీ తాజా ప్ర‌క‌ట‌న‌..

UPSC civil services prelims exam 2025 application date extension   UPSC Civil Services Prelims 2025 notification update  UPSC extends application deadline to February 18  UPSC exam registration deadline update

సాక్షి ఎడ్యుకేష‌న్: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న‌వారికి యూపీఎస్సీ శుభ‌వార్త‌ను ప్ర‌కటించింది. గ‌త నెల‌లో ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన యూపీఎస్సీ, అందుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఎంద‌రో అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. ఇప్ప‌టికే, 11వ తేదీ ఫిబ్ర‌వ‌రిన చివ‌రి తేదీగా ప్ర‌క‌టించిన యూపీఎస్సీ ఒక‌సారి గ‌డువును పొడ‌గిస్తూ.. ఫిబ్ర‌వ‌రి 18న చివ‌రి తేదీగా ప్ర‌క‌టించారు.

మ‌రోసారి గ‌డువు పెంపు..

ఇక‌, నిన్న‌టితో రెండోసారి పొడ‌గించిన గ‌డువు కూడా ముగిసింది. అయితే, తాజాగా మ‌రో ప్ర‌క‌టన విడుద‌ల చేసిన యూపీఎస్సీ బృందం మ‌రోసారి అభ్య‌ర్థులు అవకాశాన్ని వినియోగించుకుని ద‌ర‌ఖాస్తుతులు చేసుకునేందుకు చివ‌రి తేదీని పొడ‌గించారు.

AP Intermediate public exams: మార్చి 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. రేపట్నుంచే హాల్‌టికెట్స్‌ రిలీజ్‌

ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఆధారంగా, ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన అంటే, శుక్ర‌వారం నాడు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు చేసుకోవడానికి చివ‌రి తేదీగా ప్ర‌క‌టించింది.

క‌రెక్ష‌న్స్‌కు ఈ తేదీలు..

ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థులు త‌మ‌ అప్లికేషన్లలో ఏమ‌న్నా పొరపాట్లు ఉంటే గ‌న‌క ఈ నెల‌లోనే అంటే, ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు స‌రిచేసుకుని, సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. కాగా, గత నెల జ‌న‌వ‌రిలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేశారు.

Inter Board Exams 2025 : మార్చి 5 నుంచి ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌లు.. ఏర్పాట్ల ఆదేశాలు..

ఈ రిక్రూట్ మెంట్‌తో అఖిలా భారత సర్వీసుల్లో ఉన్న మొత్తం 979 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉన్న‌ 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి. ఇక‌, యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్‌ ప‌రీక్ష మే 25వ తేదీన జ‌ర‌గ‌నుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Feb 2025 12:23PM

Photo Stories