UPSC Prelims Preparation Tips: 979 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.. ప్రిపరేషన్ ఇలా..

దీని ద్వారా ఐఏఎస్(ఇండియన్ అడ్మినిస్ట్రేటిÐŒ సర్వీస్), ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్), ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) తదితర 23 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను మే 25న నిర్వహించనున్నారు. దీంతోపాటు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి కూడా దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 11.
అర్హతలు
- సివిల్స్ ప్రిలిమ్స్‌కు దరఖాస్తులు చే సుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కోర్సు ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: 2025, ఆగస్టు 1వ తేదీ నాటికి 21–32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు మూడంచెల విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తొలి దశలో ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 400 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో 200 మార్కులకు చొప్పున రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
మెయిన్ ఎగ్జామ్
రెండో దశ మెయిన్ పరీక్ష పూర్తిగా వ్యాపరూప విధానం (డిస్క్రిప్టివ్)లో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌తోపాటు ఒక స్థానిక భాష పరీక్ష 300 మార్కులకు చొప్పున ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటి మార్కులను తుది ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. వీటితోపాటు ఒక ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఒక ఆఫ్షనల్ సబ్జెక్టుపై రెండు పేపర్లు 250 మార్కులకు చొప్పున మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో సత్తాచాటిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275. ఇలా మొత్తం 2025 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కులను, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి తుది విజేతలను ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.01.2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.02.2025
- ప్రిలిమినరీ పరీక్ష తేది: 25.05.2025
- వెబ్‌సైట్: https://upsconline.gov.in/upsc/OTRP/, https://www.upsc.gov.in
![]() ![]() |
![]() ![]() |
ప్రిలిమ్స్‌లో.. విజయం సాధించేలా
తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో.. జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సిలబస్‌పై అవగాహన
సివిల్స్ అభ్యర్థులు ముందుగా.. సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్‌లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా ఏ అంశాలకు ఎంత సమయం కేటాయించాలి.. ఏ పుస్తకాలు చదవాలో స్పష్టత వస్తుంది. దీంతోపాటు గత ప్రశ్న పత్రాల పరిశీలన, విశ్లేషణ ద్వారా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి వాటిపై అవగాహన కలుగుతుంది.
ప్రామాణిక పుస్తకాలు
సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాల్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా సబ్జెక్టులకు ప్రామాణికంగా భావించే ఒకట్రెండు పుస్తకాలకు పరిమితమవడం మేలు. సిలబస్, మెటీరియల్ సేకరణలో స్పష్టత లభించిన అభ్యర్థులు.. పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.
సమకాలీనంపై పట్టు
అభ్యర్థులు ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం.. గత మూడు, నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ టాపిక్స్‌ను కోర్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు అభ్యర్థులు ఒక సబ్జెక్ట్‌ను మరో సబ్జెక్ట్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు-ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో సమన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు అంశాలపైనా పట్టు లభిస్తుంది. ఇదే తరహాలో పాలిటీ-ఎకానమీ ప్రిపరేషన్ సాగించొచ్చు.
డిస్క్రిప్టివ్ అప్రోచ్
ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా అంశాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభం చేస్తుంది.
ఇవెంతో ముఖ్యం
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ-ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ! ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తాజాగా మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి.
పేపర్-2కు ఇలా
అర్హత పేపర్‌గానే పేర్కొంటున్నప్పటికీ.. పేపర్-2 పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే..ఈ పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్-1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్ 2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్, ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.
మెయిన్స్‌తో అనుసంధానం
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే.. మెయిన్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా.. మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా సిలబస్ అంశం నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదివితే..ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
టైమ్ మేనేజ్‌మెంట్-రివిజన్
అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. దీంతోపాటు ప్రిపరేషన్‌లో భాగంగా రివిజన్‌ను అత్యంత కీలకమని గుర్తించాలి. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించే విధంగా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. రివిజన్‌తోపాటు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది.
Tags
- Civil Services Preliminary Examination 2025
- UPSC Prelims 2025
- Civil Services Exam 2025 Eligibility
- Civil Services Exam 2025 Exam Dates
- Civil Services Exam 2025 Syllabus
- UPSC CSE Notification 2025 out
- Civil Services Examination
- UPSC Exam 2025 Prelims
- UPSC Exam 2025 Mains
- UPSC Exam 2025 Interview
- UPSC Prelims Exam Pattern
- UPSC Prelims Syllabus
- UPSC Exam Pattern 2025 for Prelims
- Civil services preliminary examination syllabus
- Civil services preliminary examination question paper
- UPSC
- Civils
- UPSC Prelims preparation books