Skip to main content

Inter Board Exams 2025 : మార్చి 5 నుంచి ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌లు.. ఏర్పాట్ల ఆదేశాలు..

రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల మార్చి 5వ‌ తేదీ నుంచి ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.
Telangana inter board exams 2025 arrangements

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల మార్చి 5వ‌ తేదీ నుంచి ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు స‌క్ర‌మంగా, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా అధికారుల (డీఐఈవో)ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు..

మంగళవారం.. ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన‌ హైదరాబాద్‌లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో జూం కాల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో, అన్ని జిల్లాల డీఐఈఓలు, నోడల్ అధికారులు హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కఠినమైన నిఘాను ఉంచడానికి జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాలని కోరారు.

Inter Board Announcement : విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది ఇంట‌ర్ బోర్డు.. ఇక‌పై నో క‌న్ఫ్యూజ‌న్‌.

బఫర్, రిజర్వుడు, సిబ్బంది సంసిద్ధతను సమీక్షించామని పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను చేర్చడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో, త‌ర‌గ‌తి గ‌దుల్లో ముందుగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సంబంధిత డీఐఈవోలతో కలిసి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ఆయన వివరించారు. 

మౌలిక వ‌స‌తులు..

ప‌రీక్ష కేంద్రాల్లోని సిబ్బంది డేటాను ఇంటర్ బోర్డుకు పంపాలని ఆయ‌న‌ సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రాల వారీగా ఏర్పాట్లు, కేటాయించిన సిబ్బంది, మౌలిక వసతులను వెంటనే పంపాలని డీఐఈవోలను కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ కాలేజీలకు చెల్లింపు లేకుండా అన్ని నామినల్ రోల్ దిద్దుబాట్లను చేయాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని ఫిర్యాదులనూ తక్షణమే పరిష్కరించడానికి పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల పరీక్షా కమిటీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలనీ, పరీక్షలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Telangana Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. అత్యాధునిక సీసీటీవీ నిఘా

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Feb 2025 11:23AM

Photo Stories