Telangana Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. అత్యాధునిక సీసీటీవీ నిఘా

రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును శుక్రవారం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, జ్యోత్స్నరెడ్డిలతో కలిసి పరిశీలించారు.
Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ
తెలంగాణ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థతో పరీక్ష కేంద్రాలను రియల్‌టైంలో పర్యవేక్షించడంతోపాటు న్యాయమైన పరీక్ష వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏర్పాటు చేసిన 8,000 కంటే ఎక్కువ హైరిజల్యూషన్ కెమెరాలతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వివరించారు.
ఈ నూతన వ్యవస్థతో పరీక్షల నిర్వహణను ఏకకాలంలో పర్యవేక్షించడానికి, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతోపాటు ఏవైనా అవకతవకలను నివారించడానికి వీలు ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంపై అధికారులను మురళి ప్రశంసించారు. ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా, పరీక్ష సంస్కరణలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
UPSC IES Exam 2025 Notification: యూపీఎస్సీ IES ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు, పరీక్ష తేదీ వివరాలివే..
ములుగు జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై నమ్మకం, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యా బోర్డులకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని చెప్పారు.
Telangana Inter 1st and 2nd Year Theory Exams Timetable 2025
Timing: 9:00 AM to 12:00 Noon
Date & Day | 1st Year Examinations | 2nd Year Examinations |
---|---|---|
05-03-2025 (Wed) | PART-II: 2nd Language Paper-I | PART-II: 2nd Language Paper-II |
07-03-2025 (Fri) | PART-I: English Paper-I | PART-I: English Paper-II |
11-03-2025 (Tue) | PART-III: Mathematics Paper-IA | PART-III: Mathematics Paper-IIA |
Botany Paper-I | Botany Paper-II | |
Political Science Paper-I | Political Science Paper-II | |
13-03-2025 (Thu) | Mathematics Paper-IB | Mathematics Paper-IIB |
Zoology Paper-I | Zoology Paper-II | |
History Paper-I | History Paper-II | |
17-03-2025 (Mon) | Physics Paper-I | Physics Paper-II |
Economics Paper-I | Economics Paper-II | |
19-03-2025 (Wed) | Chemistry Paper-I | Chemistry Paper-II |
Commerce Paper-I | Commerce Paper-II | |
21-03-2025 (Fri) | Public Administration Paper-I | Public Administration Paper-II |
Bridge Course Maths Paper-I (Bi.P.C) | Bridge Course Maths Paper-II (Bi.P.C) | |
24-03-2025 (Mon) | Modern Language Paper-I | Modern Language Paper-II |
Geography Paper-I | Geography Paper-II |
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TS Inter exams
- TS Inter exams latest news
- Inter Exams 2025
- Telangana Inter Exams 2025
- TG Inter Exams 2025
- CCTV Cameras
- TGBIE
- TGBIETimetable
- Inter Exams Mandates CCTV Surveillance for Board Exams
- inter board
- TS Inter Board
- Telangana inter board
- Inter board officials
- Inter board exams
- Inter Exams
- Telangana Inter Board news
- TelanganaIntermediateExams
- IntermediateExams2025