Skip to main content

Inter Practical Exams : ఫిబ్ర‌వ‌రి 3 నుంచి ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌.. ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ఠ ఏర్పాట్లు..

ఇంట‌ర్ విద్యార్థుల‌కు వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.
CCTV arrangements at inter practical exams

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంట‌ర్ విద్యార్థుల‌కు వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. అయితే, ఇంట‌ర్ బోర్డు ఆదేశాల మెర‌కు విద్యార్థులు ప‌రీక్ష రాసే కేంద్రాల్లో సీసీటీవీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. బోర్డు పరీక్షల స‌మ‌యంలో కూడా ఎంతో పకడ్బందీగా ఇంటర్ బోర్డు ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

AP Intermediate Exams 2025 News: నేటితో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

మొత్తం 5,500

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థుల గ‌దుల్లో త‌ప్ప‌నిస‌రిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని బోర్డు ఆదేశించింది. ఈ బాధ్యతలను బ్రిహస్పతి టెక్నాలజీస్ కంపెనీకి ఇంటర్ బోర్డు అప్పగించింది. మొత్తంగా 5,500 కెమెరాలు ఏర్పాటు చేయ‌గా, అందులో ఒక్కో కాలేజీలో ఐదు సీసీ కెమెరాలు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ కేంద్రాలుంటే 8 సీసీ కెమెరాలు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

Lack of Admissions in Junior Colleges : భారీగా త‌గ్గుతున్న ప్ర‌వేశాలు.. ఎన్రోల్‌మెంట్‌కు ప్ర‌చారం..

10 కోట్లు..

ప్రాక్టికల్స్, ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాల విష‌యంపై ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయి మాట్లాడారు. ప్ర‌తీ కేంద్రంలో, ప్ర‌తీ జూనియ‌ర్ క‌ళాశాల‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని, వీటికి దాదాపుగా 10 కోట్లు ఖ‌ర్చు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌క్రియ‌ కేవ‌లం రెండు రోజుల్లో పూర్తి కానుంద‌ని వెల్లడించారు ఆయ‌న‌.

Good News for Tenth Students : విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. సర్కార్ కీల‌క ఆదేశాలు..!!

అంతేకాదు, ఈ కెమెరాలను పబ్లిక్ పరీక్షలకు, స్పాట్ క్యాంపుల్లో కూడా ఏర్పాటు చేయాల‌ని వివ‌రించారు. విద్యార్థుల బోర్డు ప‌రీక్షలు పూర్తి అయ్యేవ‌ర‌కు ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లకు చోటు లేకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. విద్యార్థులు రాసే ప్రాక్టిక‌ల్స్‌, బోర్డు పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 03:04PM

Photo Stories