Skip to main content

Good News for Inter Students : ఇంట‌ర్ విద్యార్థుల‌కు విద్యాశాఖ శుభ‌వార్త‌.. ఇంక ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదు..

రాష్ట్ర‌వ్యాప్తంగా తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు పరీక్ష‌లు ప్రారంభ‌మైయ్యాయి.
Supplying wall clocks for tg inter students board exams in centers

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు పరీక్ష‌లు ప్రారంభ‌మైయ్యాయి. విద్యార్థుల‌కు ఈసారి విధించిన నియ‌మాల్లో ఒక కొత్త నియ‌మం వాచీల‌ను అనుమ‌తించ‌డం లేదు. గ‌తంలో, వాచీల‌ను అనుమ‌తించినా, డిజిట‌ల్ వాచీల‌ను అనుమ‌తించ‌లేదు. కానీ, ఈసారి మార్పులు చాలానే చేశారు బోర్డు అధికారులు. ప‌రీక్ష కేంద్రంలోకి విద్యార్థుల ఐడీ కార్డులు, వాచీలు, గాజులు వంటివి అనుమ‌తించడం లేదు. అన్నింటికీ విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌లేదు కానీ, వాచీల విష‌యంలో విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న చెందుతూ.. అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

TS EdCET 2025 : టీజీ ఎడ్‌సెట్ 2025కు ద‌ర‌ఖాస్తులు.. ఫీజు వివ‌రాలివే..

క‌ష్టంగా మారిన నియ‌మం..

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు అధికారులు వాచీల‌ను అనుమతించ‌డం లేదు. దీంతో, విద్యార్థులు ప‌రీక్ష రాసే స‌మ‌యంలో స‌మ‌యం చూసుకోలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అధికారుల చెప్ప‌డం.. ప్ర‌తీ ప‌రీక్ష కేంద్రంలో, క్లాస్ రూముల్లో గ‌డియారాల ఏర్పాట్లు చేశార‌ని, అయితే, కొన్ని కేంద్రాల్లో ఆ గ‌డియారాలు ప‌ని చేయ‌క‌పోవ‌డం, మ‌రికొన్ని కేంద్రాల్లో అస‌లు గ‌డియారాలే లేక‌పోవ‌డం విద్యార్థుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.

ఇంట‌ర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్‌..

విద్యార్థులు ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ప‌డుతున్న ఇబ్బందుల‌ను వారి త‌ల్లిదండ్రుల‌తో పంచుకున్నారు. స‌మ‌యం తెలీక వారు ప‌డుతున్న బాధ‌లు, ఆందోళ‌న‌లు, ప‌రీక్ష స‌రిగ్గా రాయ‌క‌పోవ‌డం వంటి విష‌యాల‌ను చెప్ప‌గా, వారి త‌ల్లిదండ్రులు ఇంట‌ర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులే స్వ‌యంగా దీనికి ప‌రిష్కారంగా ప్ర‌తీ ప‌రీక్ష కేంద్రంలో, ప్ర‌తీ త‌ర‌గతి గ‌దుల్లోనూ ఒక గ‌డియారాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

Telangana Group -1 Results Breaking News : నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

ప్ర‌తీ ప‌రీక్ష గ‌దుల్లో గ‌డియారాల‌నికి రూ.100 చొప్పున చెల్లించి, ఏర్పాటు చేయాల‌ని ఆదేశించ‌గా.. వాల్ క్లాక్‌లు రూ.100కు దొరకడం కష్టం అని, మరికొంత సొమ్ము చెల్లించి అధికారులే గడియారాలు కొని పరీక్షా కేంద్రాలకు సరఫరా చేయాలని పలువురు ఇంటర్ బోర్డుకు కోరారు. ఇది విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన పరీక్షా పర్యావరణాన్ని కల్పించడానికి ఎంతో కీలకమైన నిర్ణయంగా మారింది. దీంతో, విద్యార్థులు ఇంక ఆందోళ‌న చెందాల్సి అవ‌స‌రం లేద‌ని, వారి ప్ర‌తీ ప‌రీక్ష‌ను నిర్భ‌యంగా, పూర్తి దృష్టితో రాయాల‌ని, ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Mar 2025 11:55AM

Photo Stories