Skip to main content

Lack of Admissions in Junior Colleges : భారీగా త‌గ్గుతున్న ప్ర‌వేశాలు.. ఎన్రోల్‌మెంట్‌కు ప్ర‌చారం..

ఏటా సర్కార్ జూనియ‌ర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య‌, ఎన్రోల్‌మెంట్ త‌గ్గుతోంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఇంట‌ర్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తుంది.
Drastical downfall of govt junior college admissions

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర‌వ్యాప్తంగా 428 ప్రభుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో 3 ల‌క్ష‌ల‌కుపైగా సీట్లు ఉన్నాయి. కాని, ప్ర‌వేశాల విష‌యాని వ‌స్తే మాత్రం ఎంతో వెన‌క‌బ‌డి ఉంది. గ‌తంలో జూనియ‌ర్ కాలేజీ ప్ర‌వేశాలు ల‌క్ష‌ల్లో ఉండేవి. ప్రతీ ఏటా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప్ర‌వేశాలు పొందేవారు. కాని, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా త‌గ్గుతూ 80 వేల‌కు ప‌డిపోయింది. ప్ర‌స్తుతం, ఈ సంఖ్య‌ను పెంచేందుకు క‌స‌ర‌త్తు చేస్తుంది ప్ర‌భుత్వం.

Changes in Inter Board Question Paper : ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మయంలో ఇలాంటి మార్పులు స‌రికావు.. బోర్డుపై నిపుణుల ఆగ్ర‌హం..

ప్ర‌వేశాలు క‌ల్పించ‌డమే ల‌క్ష్యంగా..

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల ప్ర‌వేశాల్లో సంఖ్య భారీగా త‌గ్గుతుంది. సీట్లు చాలానే ఉన్న‌ప్ప‌టికి, విద్యార్థులు ఆసక్తి చూపట్లేద‌ని, విద్యార్థుల‌కు మాత్రంమే కాకుండా వారి త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి మ‌రిన్ని ప్ర‌వేశాల‌ను పెంచే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని స‌న్నాహాలు చేస్తుంది స‌ర్కార్ క‌ళాశాల‌లు. మరో 50వేల అడ్మిషన్లు పెంచాలని టార్గెట్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అంటే, ప్ర‌స్తుత అడ్మిష‌న్ల సంఖ్య‌తో పోలిస్తే.. 60శాతం పెంచాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు అధికారులు.

Good News for Inter Students : ఇంట‌ర్ విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు చర్య‌లు.. ఈ స‌బ్జెక్టుల్లో ఏకంగా..

ఎన్రోల్‌మెంట్‌కు ప్ర‌చారం..

జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల ప్ర‌వేశ సంఖ్య పెంచేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మెర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల సంఖ్య‌ను పెంచేందుకు అడ్మిషన్‌ క్యాంపెయిన్‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ మెర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Inter Board : ఇంట‌ర్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఈసారి పెరిగిన ప్రశ్న‌ల సంఖ్య‌.. ఈ స‌బ్జెక్టులోనే..

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ప్ర‌తీ జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఆ ముగ్గురికి జిల్లాల్లోని కాలేజీల‌ను అప్ప‌గించి, ఎన్రోల్‌మెంట్ పెరిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఇందులో భాగంగా, ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో చేరాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు అధికారులు.

వ‌స‌తి గ్రుహాల ఏర్పాటు..

రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యార్థులు జూనియ‌ర్ కాలేజీల్లో చేరేందుకు వ‌స‌తి గ్రుహాల లోటు కూడా ఒక కార‌ణ‌మే. వారికి ఇది ఒక పెద్ద స‌మ‌స్య‌గా మారింది. వ‌స‌తి గ్రుహాలు స‌క్ర‌మంగా లేక‌, కావాల్సిన వ‌స‌తులు అందుబాటులో లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలేజీ వసతి గృహాల్లో సీట్లు పరిమితంగా ఉండటం, హాస్టళ్లో సీటు రాకపోవడంతో విద్యార్థులు సర్కారు జూనియర్‌ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు మోగ్గు చూప‌డం లేదు.

High Court: పరీక్ష ఫీజులు తీసుకోండి.. జరిమానా, పరీక్ష ఫీజుతో ముడిపెట్టొద్దు

ఈ విష‌యంపై ఇంట‌ర్ విద్యా కమిషనరేట్‌ అధికారులు స్పందించి, ప్రత్యేకంగా ప‌రిశీలిస్తున్నారు. అంతేకాకుండా, ఇంటర్‌ విద్యా డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య కలెక్టర్లతో చ‌ర్చించి కాలేజీ వసతిగృహాల్లో సీట్ల సంఖ్య‌ పెంచేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. సర్కారు కాలేజీల్లోని విద్యార్థులందరికీ హాస్టల్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వ‌ర‌లోనే అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తామ‌న్నారు. విద్యార్థులకు వ‌స‌తి గ్రుహాల్లో ఎలాంటి లోటు లేకుండా ఉండేలా అన్ని విధాల చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 12:41PM

Photo Stories