High Court: పరీక్ష ఫీజులు తీసుకోండి.. జరిమానా, పరీక్ష ఫీజుతో ముడిపెట్టొద్దు

ఈ మొత్తాన్ని జనవరి 25లోగా చెల్లించాలని పిటిషనర్ కళాశాలకు స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు విధించిన జరిమానాను పిటిషనర్ కళాశాలలు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఇక ఆలస్య రుసుము చెల్లింపు విషయానికొస్తే, ఈ నెల 28లోగా ప్రతి విద్యార్థికి రూ.2,500 చొప్పున జాతీయ బ్యాంక్ నుంచి పిటిషనర్ కళాశాలలు గ్యారంటీ అందించాలని చెప్పింది. ఈ బ్యాంక్ గ్యారంటీ అందిన తర్వాత విద్యార్థుల దరఖాస్తులను ప్రాసెస్ చేసి.. పిటిషనర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2025 మార్చిలో జరిగే తుది పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని కాలేజీలకు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఇంటర్‌బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పరీక్షలతోపాటు ఇతర విద్యా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి అనుమతించాలని.. పరీక్ష ఫీజుల చెల్లింపునకు కళాశాలలకు వెంటనే లాగిన్ అనుమతి మంజూరు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
![]() ![]() |
![]() ![]() |
జరిమానా, పరీక్ష ఫీజుతో ముడిపెట్టొద్దు
ఫైర్ ఎన్‌ఓసీ పొందాలనే నిబంధన నుంచి ఒక ఏడాది మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, అధికారులు జరిమానా విధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతించి, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కళాశాలలపై అధికారులు విధించిన జరిమానాకు, ఆలస్య రుసుముతో పరీక్ష రుసుము చెల్లింపునకు ఎలాంటి సంబంధం లేదని ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి అన్నారు.
జరిమానాను, పరీక్ష ఫీజుతో ముడిపెట్టి కోర్టు ద్వారా ఉపశమనం పొందాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కాగా జరిమానా చెల్లించడానికి సిద్ధమని, సకాలంలో పరీక్ష రుసుము చెల్లించనందుకు ప్రతి విద్యార్థి చెల్లించాల్సిన రూ.2,500 ఆలస్య రుసుమును మాఫీ చేయాలని మాత్రమే పిటిషనర్ కళాశాలలు కోరాయి.
లక్ష మంది విద్యార్థులకు ఊరట
కోర్టు తీర్పుతో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఊరట కలిగిందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీశ్ పేర్కొన్నారు. శనివారంతో పరీక్ష ఫీజు గడువు ముగుస్తున్నందున తప్పని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.