Inter Board: ఇంటర్ పరీక్షలను అనుక్షణం పరిశీలిస్తాం.. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ఇసారి ఇలా!

రాష్ట్రంలోని 90 శాతం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. పరీక్షల విషయంలో ఎలాంటి అక్రమాలు, అపోహలకు తావు లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్షల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన ఫిబ్రవరి 6న మీడియాకు చూపించారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్స్ మాదిరిగానే, వచ్చే నెలలో జరిగే థియరీ పరీక్షలకు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నామన్నారు. ప్రాక్టికల్స్‌కు ఎవరైనా విద్యార్థులు గైర్హాజరైతే, సరైన కారణం చూపించిన వారికి తిరిగి ప్రాక్టికల్స్‌కు అనుమతిస్తామని తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
పరీక్షలకు అన్ని కాలేజీలు సహకరిస్తున్నాయని చెప్పారు. థియరీ సమయంలో ప్రశ్నపత్రాలు తెరిచే రూమ్‌లో, పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారం, కారిడార్, గ్రౌండ్ ఫ్లోర్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయని వెల్లడించారు. కాగా, కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన మానిటర్లను పరిశీలించేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి జయప్రదాబాయ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.