Good News for Inter Students : ఇంటర్ విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు చర్యలు.. ఈ సబ్జెక్టుల్లో ఏకంగా..

సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు చదువు భారం తగ్గించే ప్రయత్నంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేపట్టారు. విద్యార్థులు పడుతున్న బాధలను, వారికి పెరుగుతున్న ఒత్తడిని దృష్టిలో పెట్టుకొని, వారి సిలబస్‌ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. విద్యార్థులకు రోజు రోజుకు పెరుగుతున్న భారం కారణంగా ఎంతో ఒత్తడికి గురవుతున్నారు. అయితే, వారికి ఒత్తడి తగ్గించి నాణ్యమైన విద్యను అందించాలని బోర్డు ఆశిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే పలు సబ్జెక్టుల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటించింది.
Inter Board : ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. ఈసారి పెరిగిన ప్రశ్నల సంఖ్య.. ఈ సబ్జెక్టులోనే..
30 శాతం తగ్గింపు..
ఇంటర్ విద్యార్థులకు సిలబస్‌ను తగ్గించేందుకు కసరత్తు చేస్తుంది బోర్డు. ఇందులో భాగంగా.. మరీ ముఖ్యంగా కెమిస్ట్రీ సబ్జెక్టులో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది. అంతే కాకుండా, జువాలజీ సబ్జెక్టులో సిలబస్‌ను సైతం సవరించాలని భావిస్తుంది. ఇంటర్‌లో ఎస్సీఈఆర్టీ (సీబీఎస్‌ఈ) సిలబస్ కన్నా.. తెలంగాణ సిలబస్ అధికంగా ఉంటుంది. అందులోనూ.. మరీ ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు కెమిస్ట్రీ సిలబస్ మరింత ఎక్కువ భారంగా మారింది.
మార్పుల షార్టలిస్ట్..
ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో భాగంగా విద్యార్థులు జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలన్నా.. అధికంగా కష్టపడుతున్నారు. ఈ విషయంలో విద్యావేత్తలు సైతం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 30 శాతం సిలబస్‌కు కోతపెట్టనుంది బోర్డు. ఇప్పటికే తగ్గించాల్సిన పాఠ్యాంశాలను ఇంటర్ బోర్డు షార్ట్‌లిస్టు చేసింది. కాగా, త్వరలో ఆయా సబ్జెక్టు నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, షార్ట్‌లిస్ట్ చేసిన మార్పులు ఖరారు చేస్తారు.
NEET 2025 Exam: నీట్ యూజీలో కీలక మార్పు... కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల విధానానికి స్వస్తి
ఇదే జరిగితే, ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగానే ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ప్రవేశపెట్టనుంది. కరోనాపై సైతం పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- inter board
- key announcement
- inter syllabus reduction
- students stress
- inter students stress reduction
- syllabus changes for inter students
- chemistry and physics syllabus changes
- new syllabus in inter
- telangana intermediate students
- 30 percent reduction of syllabus in inter
- inter subject faculty
- artificial intelligence
- ai subject in inter
- telangana inter board key announcement
- inter syllabus changes
- Education News
- Sakshi Education News