Skip to main content

Inter Board Clarity : 128 మందికి హాల్‌టికెట్ లేకుండానే ప‌రీక్ష‌కు అనుమ‌తి.. ఇంట‌ర్‌ బోర్డు క్లారిటీ..

విద్యార్థుల‌కు బోర్డు పరీక్ష‌లైనా, సాధార‌ణ ప‌రీక్ష‌లైనా, హాల్‌టికెట్లు త‌ప్ప‌నిస‌రి.
Telangana inter board clarity on students exam without hall ticket

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల‌కు బోర్డు పరీక్ష‌లైనా, సాధార‌ణ ప‌రీక్ష‌లైనా, హాల్‌టికెట్లు త‌ప్ప‌నిస‌రి. ఒక‌వేళ‌, హాల్‌టికెట్లను పొర‌పాటున మ‌ర్చిపోయి ప‌రీక్ష కేంద్రానికి వెళితే మాత్రం అస్స‌లు అనుమ‌తించ‌రు. ఒక‌వేళ‌, అనుమ‌న‌తి ఇచ్చినా అది అంత త్వ‌ర‌గా అవ్వ‌దు. కాని, ఒక కేంద్రంలో హాల్‌టికెట్‌ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారని, ఇటీవ‌ల ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు.

Inter Practical Exams : ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ప్రాక్టికల్ ప‌రీక్ష‌లు.. నిబంధ‌నలు త‌ప్ప‌నిస‌రి..

బోర్డు క్లారిటీ..

గ‌త కొద్ది రోజులుగా, ఇదే విష‌యంపై వ‌స్తున్న వార్త‌ల‌కు స్పందించింది ఇంట‌ర్ బోర్డు. విద్యార్థుల‌కు హాల్‌టికెట్లు త‌ప్ప‌నిసరి, అయితే, ఈ నెల 29 రాత్రి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆ 128 మంది విద్యార్థులు త‌మ‌ నుంచి అనుమ‌తి పొందారని వెల్ల‌డించింది. ఇంట‌ర్‌లో సాధార‌ణ విద్యార్థులు 4,40,931 మంది ఉండ‌గా, మ‌రి కొంద‌రు వృత్తి విద్యా విద్యార్థులు వారి సంఖ్య 50,056 వ‌ర‌కు ఉంటుంది.

TS Inter Public Exams 2025 : మేము ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలను బహిష్కరిస్తున్నాం.. ఎందుకంటే.. ?

అయితే, గురువారం, జ‌న‌వ‌రి 30వ తేదీన ఇచ్చిన క్లారిటీ ప్ర‌కారం, 128 మంది విద్యార్థుల ఫీజును వారి భ‌విష్య‌త్తును కాలేజీ మేనేజ్‌మెంట్లు, త‌ల్లిదండ్రులు, విద్యార్థుల అభ్య‌ర్థ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని, వారి మాట‌ల‌ను అనుస‌రించి, అప్ప‌టిక‌ప్పుడే చెల్లించేందుకు బోర్డు ఒప్పుకుంద‌ని తెలిపింది. ఈ రకంగా వారు హాల్‌టికెట్లు లేకుండానే ప‌రీక్ష‌కు అర్హ‌త పొందార‌ని క్లారిటీ ఇచ్చింది ఇంట‌ర్ బోర్డు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 01:22PM

Photo Stories