Telangana Intermediate Nominal Roll Correction: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్.. నామినల్ రోల్స్‌లో ఎడిట్‌కు ఇదే చివరి ఛాన్స్
Sakshi Education
ఇంటర్మీడియట్ విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు సరిచేసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సవరణలకు ఫిబ్రవరి 6 నుంచి 7 వరకు మాత్రమే గడువు ఉంటుందని తెలిపింది. తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మళ్లీ ఎటువంటి గడువు పొడగింపు ఉండదని పేర్కొంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.
Telangana Intermediate Nominal Roll Correction
నామినల్ రోల్స్ అంటే..
విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు
పుట్టిన తేది
ఎంపిక చేసిన పాఠ్యాంశాలు (1వ లాంగ్వేజ్, 2వ లాంగ్వేజ్)
మీడియం (తెలుగు/ఇంగ్లీష్/వేరే మీడియం)
డిసెబిలిటీ (అంగవైకల్యం) వివరాలు
OSSC మరియు ఒకేషనల్ సబ్జెక్ట్స్ / కోడ్స్
పుట్టుమచ్చలు (వివరణాత్మక గుర్తింపు కోసం)
ఫోటో మరియు సంతకం
వీటిలో ఏవైనా తప్పులుంటే జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌లో ఎడిట్ చేయవచ్చు. ఫిబ్రవరి 7తో గడువు ముగియనుంది.