Intermediate Board : ఇంటర్ బోర్డు అలర్ట్.. కీలక ప్రకటన.. అడ్మిషన్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి..!

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఇంటర్ కళాశాలల్లో రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి పలు వార్తలు తెగ చెక్కర్లు కొడుతుంది. వార్షిక పరీక్షలు కూడా ప్రారంభం కాకముందే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్‌లు ప్రారంభం అయ్యినట్లు ప్రచారాలు పలు వార్తా వెబ్‌సైట్‌లలో వస్తోంది. ఈ మెరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇటీవలె ఒక ప్రకటన చేసింది.
నోటిఫికషన్‌ను విడుదల చేయలేదు..
ఇప్పటికే, ఇంటర్ కళాశాలలు నూతన విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్‌లు ప్రారంభించిందని ప్రచారాలు చాలానే వచ్చాయి. అయితే, ఇంతవరకు ఇలాంటి నోటిఫికేషన్‌ను ఇంటర్ బోర్డు జారీ చేయలేదని, ఇంకా బోర్డు పరీక్షలే ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు.
TS Inter Public Exams 2025 : మేము ఇంటర్ పబ్లిక్ పరీక్షలను బహిష్కరిస్తున్నాం.. ఎందుకంటే.. ?
అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, తాత్కాలికంగా అనుబంధ జూనియర్ కళాశాలల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ tgbie.cgg.gov.in , acadtgbie.cgg.gov.in లలో ప్రదర్శిస్తామని వెల్లడించారు. తల్లిదండ్రులు.. ఒక విద్యాసంవత్సరం పూర్తి కాకుండానే మరో ఏడాదికి అడ్మిషన్‌లు తీసుకోవడం సరికాదని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని తేల్చి చెప్పింది.
అధికారిక ప్రకటనే ముఖ్యం..
నూతన విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించడం లేదా అధికారికంగా ప్రకటించడం చేస్తుంది. ఇలాంటి విషయాల గురించి తల్లిదండ్రులు నమ్మి వారి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయ్యోద్దని సూచించింది.
High Court: పరీక్ష ఫీజులు తీసుకోండి.. జరిమానా, పరీక్ష ఫీజుతో ముడిపెట్టొద్దు
తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రతీ ప్రకటనను అధికారిక వెబ్‌సైట్‌తోనే తెలుసుకోవాలని ఆదేశించింది. ఇంటర్ బోర్డు జారీ చేసిన ఆదేశాలను పాటించాలని కోరింది. నిబంధనలు అతిక్రమిస్తే 2025-26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టబోమని వెల్లడించింది. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఇంటర్ బోర్డు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telangana inter board
- inter board clarity
- ts inter board alert
- parents and students
- students education
- new academic year
- telangana inter board exams 2025
- Inter Admissions
- Admissions 2025
- new admissions in inter
- Tenth Students
- Telangana Education Department
- inter board exams updates 2025
- public exams preparation tips for students
- inter board latest announcement
- official information
- inter admissions 2025 clarity
- board clarity on inter admissions
- new updates on inter new admissions 2025
- Education News
- Sakshi Education News