Skip to main content

Changes in Inter Board Question Paper : ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మయంలో ఇలాంటి మార్పులు స‌రికావు.. బోర్డుపై నిపుణుల ఆగ్ర‌హం..

రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంట‌ర్ విద్యార్థుల‌ ఫైన‌ల్ ప‌రీక్ష‌కు ఇంక నెల‌న్న‌ర మాత్ర‌మే ఉంది.
Inter students preparing for final exams amidst recent question paper changes  Telangana intermediate board announces change in english question paper

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంట‌ర్ విద్యార్థుల‌ ఫైన‌ల్ ప‌రీక్ష‌కు ఇంక నెల‌న్న‌ర మాత్ర‌మే ఉంది. అయితే, ఈ స‌మ‌యంలో ఇంట‌ర్ బోర్డు తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచి ప్ర‌శ్న ప‌త్రంలో ఒక మార్పు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మార్పుపై ఇంట‌ర్ విద్యార్థులు, అధ్యాప‌కులు, త‌ల్లిదండ్రులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

సాధారణంగా విద్య‌లో ఎలాంటి మార్పుల‌నైనా, విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ప్ర‌క‌టిస్తుంది బోర్డు. కాని, ఈసారి ఇలా కాకుండా ప‌రీక్ష‌కు ఏకంగా కొన్ని రోజులే ఉండ‌గా మార్పులు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది తెలంగాణ‌ ఇంట‌ర్ బోర్డు. విద్యార్థుల‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇక‌పై ఒక ప్ర‌శ్న అద‌నంగా ఉంటుంద‌ని తెలిపింది. ఇంగ్లీష్‌లో చివ‌రి పార్ట్‌.. సెక్ష‌న్ సీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటూ మ‌రో ప్ర‌శ్న‌ను కేటాయించింది. దీనిపై బోర్డు అధికారుల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

No Eligible Test : ఇక‌పై ఈ రంగంలో అధ్యాప‌కుల పోస్టుల‌కు ప‌రీక్ష లేదా..? యూజీసీ తాజా ప్ర‌క‌ట‌న‌..

మార్పులు అర్థం కావు..

తాజాగా, ఇంట‌ర్ బోర్డు విడుద‌ల చేసిన నోటీస్ ప్ర‌కారం, విద్యార్థుల‌కు ఇక‌పై ఇంగ్లీష్ సెక్ష‌న్ సీలో 5 ప్ర‌శ్న‌ల‌ను కాస్త‌, 6 చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఇందులోకి మ్యాచ్ ది ఫాలోయింగ్ అనే ప్ర‌శ్న‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం సి సెక్షన్‌లోని 8 మార్కుల ప్రశ్నను 4కి తగ్గించారు. కొత్తగా కలిపిన ప్రశ్నకు ఆ 4 మార్కులు కేటాయించారు. అయితే, దాంట్లోనూ 10 ఇస్తే 8కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కోదానికి అర మార్కు కేటాయిస్తార‌ని అర్థం.

Degree Semester Results Out: డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాల విడుదల

కాని, ఈ మార్పులు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులకు అంత సాధారణంగా అర్థం కావ‌ని తెలిపారు. పరీక్షలు సమీపిస్తుండంటతో కాలేజీలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని వారికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప‌రీక్ష‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలి, ప్రోత్సాహాన్ని అందించాలే కాని, ఇలాంటి మార్పులు చేసి వారికి మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. అస‌లు ఇలాంటి మార్పులు ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నప్పుడు చేయ‌డం స‌రికాద‌ని విమ‌ర్శిస్తున్నారు.

సంఘాల‌ ఆగ్ర‌హం..

తెలంగాణ‌ ఇంటర్ బోర్డు ప్రతిపాదనలపై రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు తెలపకుండా ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేయడమంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహకరించుకోవాలని టీపీజేఎంఏ అధ్యక్షుడు సతీష్‌ డిమాండ్ చేశారు. జనవరి 17న ఇంటర్ బోర్డు పరీక్షల్లో మార్పులు చేసిందని దీని వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు స‌మీక్షిస్తున్న స‌మ‌యంలో ప్రోత్సహించాల్సిన‌వారు ఇలా మార్పులు చేసి వారిని మ‌రింత భ‌యానికి గురిచేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 01:14PM

Photo Stories