Skip to main content

Maths Exam Attendance : ప్ర‌శాంతంగా గ‌ణితం పరీక్ష‌.. హాజ‌రు శాతం ఎంతంటే..

Attendance for maths exam at ap tenth board 2025

ముమ్మిడివరం: ఏపీలో రాష్ట్ర‌వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం గణితం పరీక్ష నిర్వ‌హించ‌గా ప్రశాంతంగా ముగిసింది. ఇక‌, జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో, మొత్తం 19,115 మంది విద్యార్థులు పరీక్షకు హాజ‌రుకావాల్సి ఉండ‌గా 19,001 మంది హాజరయ్యారు. 114 మంది పరీక్షలకు గైర్హాజరైన‌ట్టు స‌మాచారం. ప‌రీక్ష‌ను ప్ర‌తీ రోజు నిర్వ‌హించే విధంగానే.. ఉదయం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వ‌హించారు.

New Online Courses: ముంబై ఐఐటీలో ఆన్‌లైన్‌ కొత్త కోర్సులు

ఇందులో, 18,932 మంది రెగ్యులర్‌, 69 మంది ప్రైవేటు విద్యార్థులు హాజ‌రై పరీక్షలు రాశారు. మొత్తం 99.40 శాతం మంది పరీక్షలకు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీం బాషా తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఈవో, డీవైఈవో జి.సూర్యప్రకాష్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హనుమంతరావుతోపాటు ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Mar 2025 01:24PM

Photo Stories