Invigilators Suspension : 10వ తరగతి పరీక్షల్లో 3 ఇన్విజిలేటర్లు సస్పెండ్.. కారణం!!

పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం గణితం పరీక్ష నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారావు కదిరి నియోజకవర్గంలో పర్యటించి 10 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన కదిరి బాలికల ఉన్నత పాఠశాల ఇన్విజిలేటర్లు రుద్రమరెడ్డి, డి.కృష్ణప్పను సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించగా.. ఆయన ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
అలాగే ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. దీంతో సదరు విద్యార్థిని డీబార్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోని ఇన్విజిలేటర్ మహమ్మద్ రఫీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. అంతేకాకుండా సదరు పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించామని వెల్లడింతారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- invigilators suspension
- ap 10th public exams 2025
- girls school
- 10th exam centers
- exam centers inspection
- students debar
- DEO Krishnappa
- invigilators suspension news in exam centers
- ap 10th exam suspensions
- students debar and invigilators suspensions
- ap tenth board exams latest news
- Education News
- Sakshi Education News