Skip to main content

Question Paper Leakage : వాట్సాప్‌లో 10వ త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌..

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని స‌బ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవ‌ల నిర్వ‌హించిన గ‌ణితం ప‌రీక్ష‌లో పేప‌ర్ లీకేజీ జ‌రిగింది.
AP 10th maths question paper leakage from whatsapp

అమరావతి: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని స‌బ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవ‌ల నిర్వ‌హించిన గ‌ణితం ప‌రీక్ష‌లో పేప‌ర్ లీకేజీ జ‌రిగింది. వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేప‌ట్టారు. అయితే, ఈ నేప‌థ్యంలో 10వ తరగతి గణితం ప్ర‌శ్నా ప‌త్రం వాట్సాప్‌లో షేర్ చేసిన‌ట్లు తెలిసింది. అక్క‌డి సిబ్బందిని ప్ర‌శ్నించ‌గా వివ‌రాలు తెలిసాయి.

No Holiday For Schools: ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్కూల్స్‌కు సెలవు లేదు ఎందుకంటే..!

ఈ విష‌యంపై ఆరా తీయ‌గా.. ప‌రీక్ష కేంద్రంలోని వాటర్‌ బాయ్‌ విద్యార్థుల నుంచి ఆ గ‌ణితం పేపర్‌ను తీసుకుని త‌న ఫోన్ వాట్సాప్ నుంచి స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డి అనే వ్యక్తికి పంపించారని తెలిసింది. దీంతో, ఆ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న‌ వాటర్‌ బాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ఇక‌పై ఇలాంటివి చోటు చేసుకుంటే, క‌ఠ‌న‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అక్క‌డి సిబ్బందికి, విద్యార్థుల‌కు హెచ్చ‌రించారు అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Mar 2025 11:59AM

Photo Stories