Summer Holidays Extended 2023 : గుడ్‌న్యూస్.. వేసవి సెలవులు పొడిగింపు.. కారణం ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే..? అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా..
తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే ప్రస్తుతం త్వరలోనే స్కూల్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఈ సమయంలో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలను ఓపెన్ జంకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాఠశాలల వేసవి సెలవులను పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ మేరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ప్రకటించారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
సెలవులను పొడిగిస్తే మంచిదని..
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా సెలవులను పొడిగిస్తే మంచిదని ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. ఈ మేరకే సెలవులను పొడిగించినట్లు ఆయన తెలిపారు. తొలుత వార్షిక పరీక్షల అనంతరం రాష్ట్రంలో 1 నుంచి ఐదు తరగతులకు జూన్ 5న, ఆరు నుంచి పదో తరగతి వరకు జూన్ 1న పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారుల పర్యవేక్షణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకరణాలను, పాఠ్యఫుస్తకాలను సరఫరా చేశారు. కానీ అధిక ఎండల నేపథ్యంలో.. వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 6వ తేదీ వరకు పాఠశాలల సెలవును పొడిగిస్తూ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ప్రకటన జారీ చేశారు.
చదవండి: Jagananna Vidya Kanuka: తల్లితండ్రులపై భారం పడకుండా
జూన్ 1 నుంచి ఎండలు మరింత పెరగడంతో.. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు కూడా జూన్ 15 తర్వాతే ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. వేసవి సెలవుల పొడిగింపు పై మంత్రి అన్బిల్ సీఎం స్టాలిన్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూన్ 11 వరకూ సెలవులను పొడిగించారు. సీఎం సూచన మేరకు.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జూన్ 12 నుంచి, 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు జూన్ 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని వెల్లడించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల వచ్చిన పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించడం లేదు. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది.
చదవండి: School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు
తెలుగురాష్ట్రాల్లో..
ఇక ఆంధప్రదేశ్, తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఎండ తీవ్రత ఇలానే కొనసాగితే తెలుగురాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉంది.