Jagananna Vidya Kanuka: తల్లితండ్రులపై భారం పడకుండా
తల్లితండ్రులపై భారం పడకుండా..
పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యాకానుక రూపంలో 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యాకానుక’ ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారు. వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఆక్స్‌ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బూట్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందిస్తున్నారు.
చదవండి: JVK: మేనమామ మేలిమి ‘కానుక’
2022–23 ఏడాదిలో లక్షా 3వేల 883 మంది విద్యార్థులకు రూ.17కోట్ల14లక్షలకు పైబడి ప్రభుత్వం నిధులు వె వెచ్చించింది. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 1,579 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిద్వారా ఈ ఏడాది బోధన సాగిస్తున్న ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు లక్షా 4వేల 396 మంది విద్యార్ధులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. వారి కోసం రూ.17కోట 22లక్షల 53వేల పైచిలుకు నిధులు ఖర్చుచేసి 4వ విడత జగనన్న విద్యా కానుకలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
- 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిట్లు
- రూ.1,650 విలువగల విద్యా సామగ్రి పంపిణీ
- జిల్లాలో లబ్ధిపొందుతున్న విద్యార్ధులు 1,04,396 మంది
చదవండి: Jagananna Vidya Kanuka: ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు.. కిట్ల క్యాలెండర్ ఇలా..
వరుసగా నాలుగవ విడత విద్యార్థులకు లబ్ధి
పాలకొండ రూరల్: పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్యేఅని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అంటుంటారు. ఆ మాటను నిజం చేయాలనే అహర్నిశలు కృషిచేస్తున్నారు. పిల్లలకు విద్యాభ్యాసంలో అవరోధాలు కలగకుండా విద్యారంగం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. అన్నివర్గాల పిల్లలు చదువుల కోసం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు ఏటా కేటాయిస్తూ కార్పొరేట్ విద్యకు దీటుగా సర్కారు బడులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు పేరిట ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు జగనన్న విద్యా కానుక పేరిట ఏటా ప్రత్యేక కిట్లు విద్యార్థులకు అందిస్తున్నారు. బడి బాట పట్టిన పిల్లలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంతో పాటు రూ.1,650 విలువైన విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా మూడేళ్ల పాటు ఈ కిట్లు అందించిన ప్రభుత్వం ఈ ఏడాది నాలుగో దఫా ‘విద్యాకానుక’ అందించేందుకు చర్యలు చేపట్టింది.
యూనిఫాంలో మార్పు
2023లో ప్రభుత్వం అందించే యూనిఫాం రంగుల్లో కొంతమేర మార్పులు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. గతంలో బాలురకు లైట్ స్కై కలర్ షర్ట్, థిక్ బ్లూ ఫ్యాంట్, బాలికలకు పింక్, బ్లూ కలయికతో కూడిన యూనిఫాం అందించారు. ఈ ఏడాది ప్లెయిన్‌గా ఉండే ఏకరూపదుస్తులను బాలురుకు, బాలికలకు మాత్రం చెక్స్ కలిగిన యూనిఫాం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే స్కూల్ బ్యాగ్ రంగులో కూడా స్వల్పంగా మార్పులు ఉండనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.