Skip to main content

AP 10th Class Exam Fee 2025: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న రెగ్యులర్‌, ఫెయిలైన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫీజులు చెల్లించాలి. ఈ నెల 11వ తేదీలోగా చెల్లించుకోవచ్చు. 
10th class exam announcement  AP 10th Class Exam Fee 2025  Fee Payment Deadline for  10th class Students
AP 10th Class Exam Fee 2025

పరీక్ష ఫీజుకు చివరి తేదీ ఇదే..

ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు 11వ తేదీలోగా నామినల్‌ రోల్స్‌ పూర్తి చేసిన తర్వాత స్కూల్‌ లాగిన్‌లో లింక్‌ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్‌ నామినల్‌ రోల్స్‌ (ఎంఎన్‌ఆర్‌) నేరుగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సబ్మిట్‌ చేయాలి. 12 – 18వ తేదీలోగా రూ. 50, 19 – 25వ తేదీలోగా రూ. 200, 26 – 30వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజును చెల్లించవచ్చు. 

AP TET Results 2024 Released: ఏపీ టెట్‌ ఫలితాలు.. ఈ లింక్‌ క్లిక్‌ చేసి రిజల్ట్స్‌ తెలుసుకోండి

AP 10th Class 2022 New Time Table; Download Study Materials and Model  Papers | Sakshi Education

ఫీజు వివరాలు..

రెగ్యులర్‌ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఫీజు రూ.125 కాగా, ఫెయిలైన వారికి మూడు, అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ. 110, ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125గా నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు మామూలు ఫీజుకు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. తక్కువ వయసున్న విద్యార్థులు (అండర్‌ ఏజ్‌ స్టూడెంట్స్‌) ఫీజుగా రూ.300 చెల్లించాలి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 04 Nov 2024 01:19PM

Photo Stories