Skip to main content

Tenth Public Exams Arrangements : ప్ర‌శ్నాప‌త్రాల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు.. కేంద్రాల్లో ఈ జాగ్ర‌త్తులు పాటించాలి..

వ‌చ్చేనెల‌లో అంటే, మార్చి 21వ తేదీన నుంచి ప‌దో త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. గ‌తంలో కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది.
QR code and serial number arrangement in tenth board exams 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: వ‌చ్చేనెల‌లో అంటే, మార్చి 21వ తేదీన నుంచి ప‌దో త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. గ‌తంలో కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. కాగా, రానున్న రోజుల్లో 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నా ఈ నేప‌థ్యంలో విద్యాశాఖ‌, పాఠ‌శాల‌ల అధికారులు ప‌రీక్ష‌ల‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌తీ ప‌రీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీపై కూడా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి, దానికి త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు యోచిస్తున్నారు.

AP Tenth Board Exams 2025 : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు బోర్డు అలెర్ట్‌.. ఈ ప‌రీక్ష తేదీలో మార్పు.. విద్యాశాఖ క్లారిటీ!!

క్యూఆర్ కోడ్‌..

టెన్త్‌ బోర్డు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రశ్న ప‌త్రాలపై అధికారులు క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో, ప్ర‌శ్న ప‌త్రాలు ఒక‌వేళ బ‌య‌ట‌కి వెళ్లినా, అతిత‌క్కువ స‌మ‌యంలో క‌నిబెట్ట‌గ‌లం అని దీనిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, క్వ‌శ్చ‌న్‌పేప‌ర్ పై సీరియల్ నంబర్‌ను కూడా ముద్రించిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంల‌పై ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం నుంచి పూర్తి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

సీసీటీవీ ఏర్పాటు..

ప‌రీక్ష‌ల‌కు ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ ప‌రీక్ష కేంద్రంలో, ప్ర‌తీ త‌ర‌గ‌తి గ‌దుల్లో సీసీటీవీ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశాలు వచ్చాయి అధికారుల‌కు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పర్యవేక్షించాలనే సూచనలు వస్తున్నాయి.

Good News for Tenth Students : విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. సర్కార్ కీల‌క ఆదేశాలు..!!

పరీక్షా కేంద్రాల్లో గోడలు దూకి కాపీలు అందించకుండా.. కిటికీ పక్కన కూర్చొని పరీక్షలు రాస్తున్న వారి ప్రశ్నపత్రాలను మొబైల్‌ ఫోన్లతో ఫొటో తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. అవసరమైతే మహారాష్ట్ర తరహాలో సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈసారి మార్కుల విధానంలోనూ మార్పులు..

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లో గ‌తంలో మార్కుల విధాన‌మే ఉండేది. దానిని తొల‌గించి, గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విద్యాసంవ‌త్స‌రంలో గ్రేడింగ్ విధానాన్ని తొల‌గించి మ‌రోసారి మార్కుల విధానాన్నే చేప‌ట్టారు అధికారులు. ఈ మార్కుల విధానంలో మొత్తంగా, 100 మార్కుల్లో.. 80 మార్కులు ప‌రీక్ష‌కు ఉంటే, 20 మార్కులు ఇంట‌ర్న‌ల్స్‌కు కేటాయిస్తారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌తీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించింది బోర్డు. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ప్రశ్నా ప‌త్రాల లీకేజీకి తావు లేకుండా ఉండాల‌న్నారు. ఎలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా ప్ర‌తీ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Feb 2025 03:50PM

Photo Stories